నవతెలంగాణ – నర్సింహులపేట: నర్సింహులపేట శ్రీ వెంకటశ్వరస్వామికి శ్రావణ మాసంలో తిరుప్పావడ సేవ శనివారం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై భానోత్ వెంకన్న, సర్పంచ్ పెదమాముల యాకయ్య, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జినుకల రమేష్ అనురాధ దంపతులు, ఆలయ చైర్మన్ విజయ్ పాల్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు హాజరై ప్రత్యేక పూజలు , అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ సేవ అంటారని అర్చకులు శ్రీ నందనాచార్యులు, రాంబాబుచార్యులు భక్తులకు వివరించారు. సుమారు 150 కిలోల వివిధ రకాల అన్నప్రసాదాలు , లడ్డు, వడ, తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యంతో వేదమంత్రోచ్ఛారణలతో అర్చించి కర్పూర మంగళ హారతులు సమర్పించారు. ఇందుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ఉంగరాల మధుసూదన్, మేక శ్రీనివాస్ రెడ్డి, పలువురు దాతలు, వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.
అత్యంత వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుప్పావడసేవా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



