నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలి..

– ఈ నెల 12 న పార్లమెంట్ మార్చ్ ను జయప్రదం చేయండి.
– ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్దన్
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని , దేశంలో విద్య ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ, కాషాయికరణకు కుట్ర చేస్తున్న  బీజేపీని  తిరస్కరించి దేశాన్ని రక్షించుకోవాలని, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ ఈ పి-2020)రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్ అన్నారు. శనివారం హుస్నాబాద్ లో ఛలో ఢిల్లీ కి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు..ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను వ్యతిరేకిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జనవరి 12న చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నమని తెలిపారు. కొత్త విధానాల పేరుతో పాత విధానాలకు స్వస్తి పలుకుతున్నారని విద్యా కాషాయకరణ,  కార్పొరేటి కరణ, ప్రైవేటీకరణకు కుట్ర చేస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు.నూతన జాతీయ విద్యావిధానం తీసుకురావడం ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని, విద్య పూర్తిగా ప్రయివేట్ వారి చేతుల్లోకి వెళ్తుందని వాపోయారు.. తెలంగాణా విభజన హామీ చట్టం ప్రకారం తెలంగాణాకీ  విద్యాసంస్థలు కేటాయించకుండా బిజేపి ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవరిస్తున్నదని  విమర్సించారు.. బీజేపీ అవలంబిస్తున్న విధానాలు అప్రజాస్వామికంగా ఉందని, ప్రజాస్వామిక పాలన కావాలంటే   మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. జనవరి 12న జరిగే చలో పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు..ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వేల్పుల ప్రసన్న కుమార్, సయ్యద్ సర్ధార్, మాలోతు సాయి కృష్ణ, నెర్నాల రాహుల్, వినయ్ వర్ధన్, గణేష్, రోహిత్ నాయక్, మురళి, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు..
Spread the love