చికిత్స పొందుతూ వృద్దుడు మృతి 

నవతెలంగాణ – బెజ్జంకి 
రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్దుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం గాగీల్లపూర్ గ్రామానికి దర్శనం రామదాసు(65)తన ద్విచక్ర వాహనంపై అక్టోబర్ 3,2023న గాగీల్లపూర్ నుండి రాజీవ్ రహదారిపై బెజ్జంకి క్రాసింగ్ వేళ్తున్న క్రమంలో కరీంనగర్ నుండి ద్విచక్ర వాహనంపై హైదరబాద్ వైపు వెళ్తున్న అబ్దుల్ సాజీధ్ తన వాహనాన్ని అజాగ్రత్తగా నడుపుతూ రామదాస్ ద్విచక్ర వాహనాన్ని డీకొట్టాడు.దీంతో బాధితుడి తలకు తీవ్ర గాయాలవ్వగా మేరుగైన చికిత్స కోసం 108 యందు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.మరింత మేరుగైన చికిత్స కోసం బాధితుడిని హైదరాబాద్ యందు గాందీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు.మృతుని కుటుంబ సభ్యుడు దర్శనం చంద్రయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపారు.
Spread the love