జర్నలిస్టుపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి

– రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు

నవ తెలంగాణ రాయపోల్ : సాక్షి జర్నలిస్ట్ పై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని,ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు అన్నారు. బుధవారం రాయపోల్ ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం సాక్షి జర్నలిస్ట్ వీరేందర్ పై దాడి చేసిన అల్లాదుర్గం ఎంపిపి అనిల్ రెడ్డి, వారి అనుచరుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు దూషించిన దాడులు చేసిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50వేల జరిమానా లేదా ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు సమాజ చైతన్యం కోసం ఏలాంటి వేతనాలు లేకుండానే నిస్వార్ధంగా, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులని, అలాంటి వారిపై ఇలాంటి దుర్ఘటనలు జరగడం బాధాకరమన్నారు. జర్నలిస్టులు అంటేనే నిత్యం ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగిన ప్రపంచానికి తెలియజేయడం కోసం వార్తలను సేకరించి నిజాలను ప్రపంచానికి తెలియజేస్తారని, అలాంటి వాస్తవాలను వార్తలుగా రాస్తే జీర్ణించుకోలేక దాడులు చేయడం ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తావని దుర్భాషలాడి జర్నలిస్ట్ వీరేందర్ పై దాడి చేసిన ఎంపీపీ అనిల్ రెడ్డి, వారి అనుచరులను తక్షణమే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. జర్నలిస్టులు వార్తలు రాస్తే దాడులు చేయడం పత్రిక స్వేచ్ఛను హరించడమే అన్నారు. ఎంపీపీ అనిల్ రెడ్డి పై చర్యలు తీసుకోకపోతే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల  ఉపాధ్యక్షులు కుమ్మరి రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి నర్సింలు, సలహాదారులు యాదగిరి,సభ్యులు గణేష్, కనకస్వామి తదితరులు పాల్గొన్నారు.

Spread the love