Monday, June 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రజా పోరాటం నెగ్గింది..అంబుజా వెనక్కి తగ్గింది

ప్రజా పోరాటం నెగ్గింది..అంబుజా వెనక్కి తగ్గింది

- Advertisement -

సిమెంట్ పరిశ్రమ రద్దు
ప్రజా విజయం
యాదాద్రి భువనగిరి
జిల్లా కలెక్టర్ ప్రకటన

​అంబుజా సిమెంట్ పరిశ్రమ రద్దు ప్రజా విజయం
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ప్రకటన


​​నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
​అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతిపాదిత నిర్ణయం వీగిపోయింది. ప్రజా పోరాటాలు గెలుపొంది అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వెనక్కి తగ్గింది. నాలుగు సంవత్సరాల పోరాట ఫలితం సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రతిపాదితను రద్దు చేస్తున్నట్టు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు. ​అదానీ గ్రూప్ డ్రై పోర్టు కంపెనీ ఏర్పాటు చేస్తామని నాలుగేండ్ల కింద యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో డ్రైపోర్టు కంపెనీ పేరుతో 2600పైగా ఎకరాల భూమి కావాలని ప్రజలను నమ్మబలికారు. ప్రజలకు, పంట పొలాలకు ఎలాంటి నష్టం, కాలుష్యం ప్రమాదం లేదని, పైగా కంపెనీ వస్తే.. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయని ఆశలు చూపారు. మోసం చేసి భూములు కొనుగోలు చేశారు. రెండేండ్ల తర్వాత డ్రై పోర్టు కాదు.. కాలుష్యకారక సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామంటూ చెప్పింది. దాంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ​రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం, రామన్నపేట, సిరిపురం, వెల్లంకి,జనంపల్లి, ఇస్కిల్ల, పెద్దకాపర్తి తదితర గ్రామాల్లో ​డ్రై పోర్టు పేరుతో ప్రజలను నమ్మించి భూములు కొనుగోలు చేసింది అదానీ టీమ్. రెండేండ్ల తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామనడంతో ప్రజలు అడ్డం తిరిగారు.

మాయమాటలు చెప్పి తమ భూములు తీసుకున్నారని, పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమ తమ భూముల్లో వద్దంటూ రామన్నపేట మండల రైతులు పోరుబాట పట్టారు. వీరికి అఖిలపక్షం, పర్యావరణ పరిరక్షణ వేదికతోపాటు సీపీఐ(ఎం) మద్దతు తెలిపింది. ​2024 అక్టోబర్ 23 న ప్రజాభిప్రాయ సేకరణ ముందే సీపీఐ(ఎం) సిమెంట్ కంపెనీ నిర్మాణం తలపెట్టిన స్థలం వద్ద ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. రైతులకు అండగా పోరుబాటలో ముందుభాగాన నిలిచి.. అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్‌ సమావేశాలు, పర్యావరణ పరిరక్షణ వేదిక ఏర్పాటుచేసి మండల వ్యాప్తంగా ఆందోళన, పోరాటాలు, నిరసనలు తెలిపింది. అక్టోబర్ 15న పర్యావరణ సైంటిస్టులను, మేధావులను పిలిపించి మెగా సదస్సు నిర్వహించింది. అంతేకాకుండా అక్టోబర్ 23న ప్రజాభిప్రాయ సేకరణకు సుమారు 10 వేల మందిని సమీకరించి ముక్తకంఠంతో వ్యతిరేకించింది. అంబుజా ప్రతిపాదిత స్థలాన్ని అప్పటి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వందలాది ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా వెళ్లి పరిశీలించారు. విధ్వంసకర సిమెంట్ ఫ్యాక్టరీని జనావాసాల మధ్య పెట్టొద్దని, వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు.

​అఖిలపక్షం వైపు.. అధికార పక్షం..
​అఖిలపక్షం ఆధ్వర్యంలో అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మాకొద్దంటూ రెండేండ్ల పోరాట ఫలితంగా శనివారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అధికారపక్ష ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేలు సమక్షంలో నిర్వహించిన సమావేశంలో పర్యావరణాన్ని హాని కలిగించే పరిశ్రమలు వద్దు అంటూ అఖిలపక్షం పోరాటానికి అండగా నిలిచి ఆదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రతిపాదిక రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

అంబుజా సిమెంట్ పరిశ్రమ రద్దు ప్రజా విజయం
​​రామన్నపేటలో అంబుజా సిమెంట్ పరిశ్రమ నెలకొల్పే ప్రయత్నాన్ని మండల ప్రజలు ఐక్యంగా ఎదుర్కోవడం వల్లే ఆదానీ గ్రూప్ వెనక్కి తగ్గింది. ఇది ప్రజా విజయం. సిమెంట్ పరిశ్రమ పెట్టబోయే విషయాన్ని ముందే గ్రహించిన సీపీఐ(ఎం) అన్ని రాజకీయ పక్షాలను, వ్యాపార వర్గాలను, విద్యాసంస్థలను, ప్రజల్ని సమీకరించడం, ఐక్యం చేయడం, చైతన్య వంతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది. ప్రజలకు హాని కలిగించే ఏ అంశాన్ని అయినా సీపీఐ(ఎం) బలంగా వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం సిమెంట్ పరిశ్రమ స్థానంలో లాజిస్టిక్ పార్క్ పెడతామని అదానీ గ్రూప్, స్థానిక ఎంఎల్ఏ, ఎంపీ, కలెక్టర్‌ సమక్షంలో ప్రకటించారు. ఈ పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వస్తువుల ఎగుమతి, దిగుమతి సందర్బంగా వాహనాలు వెదజల్లే దుమ్ము దూళి, ఇతర కాలుష్య సమస్యలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో బహిరంగంగా ప్రకటించాలి. ఏ పరిశ్రమ పెట్టినా ప్రజలకు నష్టం వాటిల్లకూడదు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ.జహంగీర్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -