– గరీబోళ్ల బిడ్డ నిన్ను మరువదు తాండూరు గడ్డ
– సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది
– అన్నదాతలకు అండగా నిలిచిన గౌరవం సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది
– హ్యాట్రిక్ కొడతాం..ఇచ్చిన హామీలన్నీ అమలుపరుస్తాం
– కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరవు, అరువు అభ్యర్థుల కోసం బీజేపీ పాకులాట
– బీఆర్‌ఎస్ బషీరాబాద్ మండల ఎన్నికల శంఖారావసభలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-యాలాల
2018 ఎన్నికల నాటి నుంచి ఎన్నికల శంఖారావానికి యాలాల గడ్డ (లక్ష్మీ నారాయణపూర్ చౌరస్తా) అచ్చొచ్చిం ది. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్ చౌరస్తా సమీపంలో మంగళవారం బీఆర్‌ఎస్ బషీరాబాద్ మండల ఎన్నికల శంఖారావసభను ఆ పార్టీ మండలాధ్యక్షులు నర్సి రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. శంఖారా వానికి ముఖ్యఅతిథులుగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరయ్యారు. పైలెట్ సభా ప్రాంగణంలోకి అడుగుపెట్ట గానే గరీబోళ్ల బిడ్డ నిన్ను మరవదు తాండూరు గడ్డ అం టూ అశేష జనం తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ..సంక్షేమ పథకాల అమలులో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. అన్నదాత లకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు దక్కిందని చెప్పారు. గ త ప్రభుత్వాలు మహిళలు, రైతులు, యువతను, పట్టిం చుకున్న దాఖలాలు లేవన్నారు. కానీ ప్రతి ఒక్కరం ఉద్యమ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ నేడు సీఎం కేసీ ఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ దిశగా ప్రయాణిస్తుం దన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామాలు రాష్ట్రాలు, దేశం, బాగుంటుందని వ్యాఖ్యానించారు. అందుకు అనుగు ణంగా రైతుబంధు, రైతుబీమా, రైతువేదికలు, రైతురుణ మాఫీ వంటి పథకాలు తెచ్చి అన్నదాతకు అండగా నిలిచి నా బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మూడోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కేసీఆర్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలోను రైతులకు ప్రాధాన్యత ఇచ్చి సీఎం గొప్ప మనసు చాటుకున్నారన్నారు. రైతుబంధును రూ. 10 వేల నుంచి దశలవారీగా రూ.16 వేలకు పెంచారు. నిరుపేద కుటుంబానికి రూ.5 లక్షల కేసీఆర్ బీమా రానుం దని చెప్పారు. ఆసరా పింఛన్లు రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచిండ్రు, వికలాంగులకు రూ.3 వేల నుం తచి రూ.6 వేలకు పెంచామని తెలిపారు. మహిళలు అత్యవస రమైన గ్యాస్ సిలిండర్ ధరను రూ.400లకే ఇవ్వనున్నట్లు చెప్పారు. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెల రూ. 3 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచామన్నారు. ఇప్పటినుంచి రేషన్‌లో కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తా మని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పథకాలు ఇలాగే ఉం డాలి అన్న.. కొత్త మేనిఫెస్టోలోని అంశాలన్నీ అమలు కావా లన్నా.. అందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ముషీరాబాద్ మండల కేంద్రానికి రూ.3 కోట్లు కేటాయించి, ప్రతి గ్రామానికి రూ.50 లక్షల తో బషీరాబాద్ మండలం రూపురేఖలు మార్చమన్నారు. కాం గ్రెస్ వాళ్లకు అభ్యర్థులు లేక పక్క జిల్లా నుంచి తెచ్చు కుం టున్నారని సెటైర్లు వేశారు. అరువు అభ్యర్థుల కోసం బీజేపీ పాకులాడుతుందన్నారు. తాండూర్ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో వారికి తెలుసా అని ప్రశ్నించా రు. ఎప్పటికైనా.. ఇంటోడు ఇంటోడే. భయటోడు బయ టోడే. ఇలాంటి వాళ్లను పోలిమేర దాటే వరకు తరిమి కొట్టాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బంపర్ మెజార్టీతో గెలిపించండి, ఇంతకుమించి రెట్టింపు అభివృద్ధి చేసి చూపి స్తానని పైలట్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్‌ఎస్ నేతలు విట్టల్ రెడ్డి, శ్రీశైల్ రెడ్డి, కరణం పురుషో త్తం రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్‌రామిరెడ్డి, వైస్ చైర్మన్ అజరు ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి, రైతు సమితి మండల అధ్యక్షులు పాండురంగారెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండలాధ్యక్షులు రాము నాయక్, వైస్ ఎంపీపీ, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీ సభ్యు లు, సొసైటీ డైరెక్టర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, పెద్దఎత్తున పాల్గొన్నారు.