– తాండూరులో బీఆర్‌ఎస్ యువ ప్రభంజనం సభ సక్సెస్
– రోహిత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం
– మంత్రి పట్నం మహేందర్ రెడ్డి
– రానున్న రోజుల్లో 40శాతం యువతకే ప్రాధాన్యం
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం తాం డూరు పట్టణ కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో యు వత ప్రభంజనం సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి వేలాది మంది యువత ప్రభంజనం సభా కార్యక్రమానికి తరలివచ్చారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల కోసం తాండూర్‌కు వచ్చిన కొత్త బిచ్చగాళ్లకు తాండూరు తడాఖా చూపించాల న్నారు. తాండూరు నియోజకవర్గంలో మనోహర్ రె డ్డి ఏం సేవ చేశారని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నిం చారు. తాండూర్ నుంచి ప్రజలకు అన్నం పెట్టారా మొక్క నాటారా తాండూరుకు మనోహర్‌రెడ్డి చేసిం ది ఏమిటన్నారు. తాండూరులో సీఎం కేసీఆర్ సహ కారంతో రూ.1680 కోట్లతో తాను అభివృద్ధి కార్య క్రమాలు చేశారని గుర్తుచేశారు. తనకు యువతే ఎ మ్మెల్యే పదవి కట్టబెట్టిందని తాండూరు యువత రు ణం తీర్చుకుంటానన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు గురైన గతంలో తనను వీడ లేదన్నారు. ఆర్.కృష్ణయ్య కుమారుడు డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ..ఎమ్మెల్యే రోహిత్‌లో ‘మా నా న్న కనిపిస్తున్నాడని అపరచాణక్యుడు రోహిత్‌కు బీసీ సంఘం పూర్తి మద్దతు ఉంటుందని’ అన్నారు. కార్య క్రమంలో యువజన విభాగం నాయ కులు కార్యకర్త లు అభిమానులు యువకులు తదితరులున్నారు.