ఎండలు మండిపోతున్నాయి. ఎండల్లో చల్లని నీరు తాగడానికి చాలామంది కుండలు వాడుతుంటారు. ఫ్రిజ్ నీళ్ల కంటే కుండ నీళ్లు ఆరోగ్యానికి మంచివి. అయితే కుండను సరిగ్గా నిర్వహించుకోకపోతే అనారోగ్యాల బారిన పడే ప్రమాదముంది. అందుకే కుండను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో తప్పక తెలుసుకోవాలి.
నిర్మాణపరంగా కుండ సన్నని రంధ్రాలతో తయారుచేసి ఉంటుంది. ఈ రంధ్రాలే ఎండ వేడి నుండి నీళ్లను చల్లగా ఉంచుతాయి. అయితే ఈ నీళ్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
కొత్త కుండను వాడేవాళ్లు ముందుగా దాన్ని నీళ్లల్లో నానబెట్టాలి. ఒక రోజంతా అలాగే ఉంచాలి. ఇలా చేస్తే మట్టి వాసన కూడా రాదు. నానబెట్టిన కుండను ఏదేని డిష్‌వాష్ స్క్రబర్‌తో శుభ్రంగా తోమాలి. ఆ తరువాత ఎండలో పెట్టాలి.
ప్రతి రోజూ ..
చాలామంది చేసే తప్పు ఏంటంటే కుండను ప్రతి రోజూ శుభ్రం చేయరు. అందులోనే మళ్లీ మళ్లీ నీళ్లు నింపుతుం టారు. ఇలా చేయడం వల్ల ఎండ వేడికి ఆ నీళ్లల్లో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. దుమ్ము, ధూళి కణాలు కూడా చేరతాయి. ఇలాంటి కుండలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ప్రతిరోజూ కుండను శుభ్రం చేయాలి.
సబ్బుతో వద్దు ..
కుండను సబ్బు, సర్ఫు లాంటి డిటర్జెంట్లతో శుభ్రం చేయకూడదు. కుండలో ఉండే రంధ్రాల్లో వీటి అవశేషాలు అలానే ఉండిపోయి నీళ్ల రుచి మారిపోతుంది. అలా కాకుండా సహజసిద్ధంగా శుభ్రం చేసుకోవాలి. ఉప్పు, బేకింగ్ సోడాతో శుభ్రం చేయడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది. అలాగే నెలకు ఒకసారి వెనిగర్‌తో శుభ్రం చేసుకోవాలి.
కుండను ఇలా…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



