– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆడప సంతోష్
నవతెలంగాణ -మహాముత్తారం
అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అడప సంతోష్ అన్నారు. బుధవారం మహాముత్తారం మండల కేంద్రంలో గత మూడు రోజుల నుంచి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆడప సంతోష్, అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శి ఐ రెడ్డి జయప్రభ రెడ్డి మాట్లాడుతు. అంగన్వాడీ లడిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి, కనీస వేతనం 26 వేల వరకు ఇవ్వాలి, పెన్షన్ ఐఎస్‌ఐ ఉద్యోగ భద్రత కల్పించాలి,. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి చెల్లించాలి, రిటర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 10 లక్షలు హెల్పర్లకు రూ 5 లక్షలు చెల్లించాలి, వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలి 60 సంవత్సరాలు దాటిన అంగన్వాడీ ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ కోరితే బెనిఫిట్స్ కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షల వరకు చెల్లించాలని, రాష్ట్ర, కేంద్రం చెప్పే అంత వరకు ఈ సమ్మె ను ఉదతం చేస్తమని అన్నారు ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
మల్హర్‌రావు:
అంగన్ వాడిల,ఆయాల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి మూడోవరోజుకు చేరుకొంది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా మండలంలోని తాడిచెర్ల,కొయ్యుర్ సెక్టార్ల అంగన్ వాడి టీచర్లు,ఆయాలు మండల కేంద్రమైన తాడిచెర్లలో తహశీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టారు.ఈ సందర్భంగా టీచర్లు మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించాలని,కనీస వేతనం రూ.26 వెలు ఇవ్వాలని, రిటైర్డ్ బెనిఫిట్ టీచర్ కు రూ.10 లక్షలు,ఆయాకు రూ.5 లక్షలు ఇవ్వాలని,సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ వర్తింపజేయాలని,హెల్త్ కార్డు రూ.5 లక్షలు ఇవ్వాలని,జీతంలో సగం పెంచన్ ఇవ్వాలని,పెండింగ్ బిల్లులు,టిఏ డిఎలు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు జయప్రద, అరుణ,రమాదేవి,పద్మ, అన్నపూర్ణ,వెంకట నర్సమ్మ పాల్గొన్నారు.
మహదేవ్‌పూర్:
మహాదేవపూర్ మండల కేంద్రంలో గత మూడు రోజుల నుంచి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు బుధవారం డివైఎఫ్‌ఐ జిల్లాప్రధాన కార్యదర్శి ఆత్కూర్ శ్రీకాంత్ కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మహేందర్ మద్దతు తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు అంగనవాడి ఉద్యోగులకు కల్పించడం లేదు. అన్నారు రాష్ట్ర కేంద్రంలో చెప్పే అంత వరకు ఈ సమ్మె ను ఉదతం చేస్తమి అన్నారు ఈ కార్యక్రమం లోమహాదేవపూర్ పలిమల మండలాలఅంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.