నవతెలంగాణ ‘ఎఫెక్ట్‌’.. భగీరథ పైప్‌లైన్‌ మరమ్మతులు

– హర్షం వ్యక్తం చేసిన రెండు పంచాయతీల ప్రజలు
నవతెలంగాణ-గార్ల
మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌ కు మరమ్మత్తులు చేపట్టేది ఎవరు’ అనే శిర్షీకన గురువారం నవతెలంగాణ పత్రికలో కథనం ప్రచురితమైన విషయం విధితమే. అదే రోజు అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టారు. మండలంలోని శేరిపురం గ్రామ సమీపంలో ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణ పనులలో భాగంగా అలుగుపై నిర్మిస్తున్న చప్టా నిర్మాణం చేపడుతున్న సమయంలో మిషన్‌ భగీరథ పైపును తొలగించి డమ్మీ చేశారు. దీంతో పినిరెడ్డిగూడెం, బాలాజీ తండా పంచాయతీలకు వారం రోజులపాటు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో అటు రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్‌ ఇటు మిషన్‌ భగీరథ అధికారులు పట్టించుకోకపోవడంతో నవతెలంగాణ అందించిన కథనం పై స్పందించిన మిషన్‌ భగీరథ ఎఈ వేణు గోపాల్‌ రెడ్డి వెంటనే యుద్ధ ప్రాతిపాదికన పైపు లైన్‌ ను జాయింట్‌ చేయించారు. గురువారం రాత్రి నుండే మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తామని వెల్లడించారు. వారం రోజుల నీటి సమస్యను అధికారుల దృష్టి కి తీసుకవెళ్ళి నీటి సమస్యను పరిష్కరించడానికి కృషి చేసిన నవతెలంగాణ పత్రిక కు అయా గ్రామాల ప్రజలు కతజ్ఞతలు తెలిపారు.

Spread the love