నవతెలంగాణ-గోవిందరావుపేట
గృహలక్ష్మి దరఖాస్తుదారుల ఇంటింటి సర్వే మండల వ్యాప్తంగా అధికారులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సోమవారం మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాలనీలో గృహ లక్ష్మీ కొరకు దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి వద్దకు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పంచాయతీ కార్యదర్శి డేగల శంకర్ తో కలిసి గృహాలను లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించారు. అదేవిధంగా తహసిల్దార్ అల్లం రాజకుమార్ మరియు ఆర్ఐ రవీందర్, లు పసర గ్రామంలో విస్తృతంగా దరఖాస్తుదారుల ఇంటింటి సర్వే నిర్వహించారు. సర్వే 80% పూర్తయిందని దరఖాస్తుదారులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని అధికారులు తెలిపారు.