రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి జనసేన ఆర్థిక సహాయం

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అశ్వారావుపేట మండలం దబ్బతోగు గ్రామానికి చెందిన పాయం మనోజ్  కుటుంబ సభ్యులకు జన సేన మండల కమిటీ ఆద్వర్యంలో  నియోజకవర్గం ఇంచార్జి డేగల రామచంద్రరావు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని బాధ్యత కుటుంబం ఇంటికి వెళ్లి సోమవారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మల్లం రామకృష్ణ,అడ్డూరి అనిల్, బద్దిరెడ్డి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love