నవతెలంగాణ – అశ్వారావుపేట
వినాయకపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మారు మూల గిరిజన గ్రామమైన పెద్ద మిద్దె (కత్తి కోయ గ్రామం) లో వైద్యాధికారి రాందాస్ పర్యవేక్షణలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. మొద్దలమడ నుండి సుమారు దట్టమైన అటవి మార్గం గుండా రెండు వాగులు దాటి 7 కి.మీ మోటర్ సైకిల్ పైనా, కొంత దూరం 4 కి.మీ కాలినడకన చేరుకొని శిబిరం నిర్వహించారు. 41 మందికి చిరు వ్యాధులకు చికిత్స అందించారు.జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి రక్త నమూనా సేకరించి మలేరియా లేదు అని నిర్ధారణ చేసారు. అనంతరం గృహ పరిసరాలు, లోపల బయట దోమలు నివారణ మందు ఏ.సీ.ఎం 5% పిచికారి చేయిచ్చునది.ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలని, దోమ తెరలు సక్రమంగా వాడాలని, చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు,నులిపురుగులు నివారణ కు ఆల్బెండ జోల్ మాత్రలు అందజేసారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించు కోకుండా ఉన్నవారిని గుర్తించి వారికి ఏఎన్ఎం ద్వారా కోయ బాషలో వారికి అర్ధం అయ్యేలా చెప్పి ఒప్పించారు.వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన మీరు తాగాలని ప్రజలకు అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు, హఎచ్ఇఒ రాజు, పర్యవేక్షకుడు శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ.ఎఎన్ఎం చెల్లమ్మ, అంగన్వాడి కార్యకర్త శ్యామల, ఆశా సత్యవతి,ప్రతాప్ రెడ్డి, ఏసు రెడ్డి పాల్గున్నారు.