నవతెలంగాణ -పెద్దవంగర: అనారోగ్యంతో బాధపడుతున్న మండల వైస్ ఎంపీపీ బొమ్మెరబోయిన కల్పన ను ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఆదివారం పరామర్శించారు. తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఎంపీపీ కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైస్ ఎంపీపీ త్వరగా కోలుకుని, ఇంటికి రావాలని ఆకాంక్షించారు.