జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

నవతెలంగాణ -పెద్దవంగర: తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఎస్సై రాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జయశంకర్ సార్ జయంతి వేడుకలను విశ్వబ్రాహ్మణ సంఘం మండల గౌరవ అధ్యక్షుడు బోగోజు భద్రయ్య చారి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. నాయకులు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన 1969 నుంచి నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సుదర్ఘీ పోరాటంలో కీలకంగా నిలిచారన్నారు. జయశంకర్ సార్ కన్న కలలు సీఎం కేసీఆర్ తన పరిపాలనతో సాకారం చేస్తున్నాడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా నడుస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి, సకల జనుల అభ్యున్నతిని సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల రైతు కోఆర్డినేటర్ పాకనాటి సోమారెడ్డి, మండల విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున చారి, ఎంపీటీసీ సభ్యులు ఏదునూరి శ్రీనివాస్, ఉపసర్పంచ్ శ్రీరామ్ రాము, ముత్తినేని శ్రీనివాస్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సంకెపల్లి రవీందర్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలుక బిక్షపతి, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బోగోజు వేదాచారి, బోగోజు ఆచారి, దుర్సోజు రాజు కుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love