ప్రజా ఉద్యమాలకు చిరునామా గద్దర్..

– నివాళులర్పించిన నిజామాబాద్ కవులు
నవతెలంగాణ- కంటేశ్వర్
గద్దర్ తో మమేకం కానీ ప్రజా ఉద్యమాలు ఏవి లేవని, ప్రజల పక్షాన నిలిచి అలుపెరుగకుండా పోరాటం సాగించిన గద్దర్ జీవితం త్యాగాలతో కూడుకున్నదని ప్రముఖ కవి పంచరెడ్డి లక్ష్మణ గద్దర్ కు నివాళులర్పించారు. ఈ ఆదివారం సాయంత్రం కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన గద్దర్ నివాళి సభలో ఆయన మాట్లాడారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గద్దర్ నిజాంబాద్ లో నిర్వహించిన సభ చారిత్రాత్మకమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. పాటల రచయితగా గాయకుడిగా వెరసి ప్రజా వాగ్గేయకారునిగా వైతాళికునిగా ప్రజల హృదయంలో గద్దర్ చిరస్థాయిగా నిలిచిపోతాడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు ఘనపురం దేవేందర్, డాక్టర్ కాసర్ల నరేష్ రావు, దారం గంగాధర్, తిరుమల శ్రీనివాసార్య, బాగుల యాదగిరి, మద్దుకూరి సాయిబాబు, ఆర్. మధు, సందీప్ తదితరులు పాల్గొని గద్దర్ కు నివాళులర్పించారు.

Spread the love