ప్రకృతి వైపరీత్యాన్ని సమిష్టిగా ఎదుర్కొందాం..

– సబ్ రిజిస్టార్ తస్లీమా మహమ్మద్
నవతెలంగాణ-గోవిందరావుపేట
వరదల ప్రకృతి వైపరీత్యాన్ని సమిష్టిగా ఎదుర్కొందాం అని సబ్ రిజిస్టార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ఆదివారం మండలం లోని ప్రాజెక్టు నగర్ గ్రామంలో 80 కుటుంబాలకు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యవసరాలు సాయంగా అందించారు. ఈ సందర్భంగా తస్లీమా మహమ్మద్ మాట్లాడుతూ అకాల వర్షాలతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడం బాధాకరమని,ఇలాంటి సందర్భంలోనే మనోధైర్యంతో ఉండాలని  అన్నారు. ప్రకృతి వైపరిత్యంతో నష్టం జరిగిన ఇదోక మనుషుల విలువను తెలిసేలా చేసిందని, మనుషులంతా ఒక్కటేనని ఎలాంటి తారతమ్యాలు లేకుండా సమాజంలో అందరూ కలిసి ఉండాలని తస్లీమా అన్నారు. ఈ కార్యక్రమంలో తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు.
Spread the love