ఆగస్టు 7న భారత్ బంద్ విజయవంతం చేయండి..

– చింత కృష్ణ  తుడుం దెబ్బ ములుగు జిల్లా అధ్యక్షుడు
నవతెలంగాణ -గోవిందరావుపేట
మణిపూర్ రాష్ట్ర సంఘటనలకు నిరసనగా ఈనెల 7న నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్ ను విజయవంతం చేయాలని తుడుం దెబ్బ ములుగు జిల్లా అధ్యక్షులు చింతా కృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని పసర గ్రామంలో చింత కృష్ణ మీడియాతో మాట్లాడారు.మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసీలపై పెద్ద ఎత్తున జరుగుతున్న అన్యాయాలు అత్యాచారాలు వారి ఇళ్లపై దాడులు చేస్తూ ఇళ్లను తగలబెట్టడం కుకీ తెగ మహిళలపై సామూహిక అత్యాచారాలు మహిళలను బట్టలు విప్పి బహిరంగంగా ఊరేగించడం ఈ ఆకృత్యాలను వ్యతిరేకిస్తూ దీనికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఆదివాసీలకు న్యాయం జరగాలని దేశవ్యాప్తంగా ఆదివాసీలు ఎదుర్కొంటున్న 23 అంశాలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా రేపు ఆగస్టు 7 రోజున భారత్ బంద్ నిర్వహించాలని తీర్మానించినదన్నారు.ఈ భారత్ బందులో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఉద్యోగ ఉపాధ్యాయ మేధావులు మహిళలు విద్యార్థులు బీసీ ఎస్సీ మైనార్టీ అనుగారిన వర్గాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
Spread the love