శిల్పకళావేదికలో ‘భోళాశంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం

నవతెలంగాణ – హైదరాబాద్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేశ్ కాంబోలో తెరకెక్కిన ‘భోళాశంకర్’ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటోంది. హైదరాబాదులోని శిల్పకళావేదిక ఈ వేడుకకు వేదికగా నిలుస్తోంది. భారీగా మెగా ఫ్యాన్స్ తరలిరావడంతో శిల్పకళావేదిక కోలాహలంగా మారింది. చిరంజీవితో సహా చిత్రయూనిట్ సభ్యులందరూ భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరుకానున్నారు. తమిళంలో సూపర్ హిట్టయిన ‘వేదాళం’ చిత్రానికి మార్పులు చేర్పులు చేసి తెలుగులో మెగాస్టార్ హీరోగా ‘భోళాశంకర్’ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు విశేషంగా ఆదరణ పొందుతున్నాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ ఖాయం అంటూ చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా, చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటించింది.

Spread the love