కామ్రేడ్ రమణ పేరు మీద చెన్నూరులో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు…

– ప్రారంభించిన రాష్ట్ర నాయకులు పి.సోమయ్య
నవతెలంగాణ – ఆదిలాబాద్
అమరజీవి కామ్రేడ్ టి. ఎన్వీ రమణ స్పూర్తితో భూ ఉద్యమాలు ఉదృతం చేస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి. సోమయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్యూరు మండలంలో కామ్రేడ్ టి.ఎన్వీ రమణ పేరు మీద విజ్ఞాన కేంద్రాని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి. సోమయ్య ప్రారంభించారు. సీపీఐ(ఎం) చెన్నూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రోజున 2వ రోజు కొనసాగుతున్న రాజకీయ శిక్షణ తరగతులు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ బోడేంకి చందు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర సీనియర్ నాయకులు పి. సోమయ్య  హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ… చెన్నూరు మండలంలోని బావురావుపేట గ్రామ శివారులోని సర్వే నెంబర్ 08 లో గల ప్రభుత్వ భూములను అక్రమర్కుల నుండి, భూ కబ్జా దారుల నుండి కాపాడి, ఇండ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలివ్వాలి, గృహలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వాలి, ఇండ్లు వేసుకున్న పేదలకు రోడ్డు, విధ్యుత్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇండ్ల పోరాటంలో కామ్రేడ్ టి. ఎన్వీ రమణ పోరాట స్పూర్తితో విజ్ఞన కేంద్రం కార్యాలయం ప్రారంభించారు. మన దేశానికి స్వతంత్ర వచ్చి 70 ఏండ్లు గడిచిన దేశంలోని ప్రజలకు కనీస సౌకర్యలు, కుడు, గూడు, విద్య, ఉపాధి అవకాశలు కల్పించడంలో దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయ్యాన్నారు. నేడు బీజేపీ పాలిత రాష్టాలల్లో మహిళలకు భద్రత లేదు. మనీపూర్ లో జరుగుతున్న మరణహోమన్ని ఆపాలి, ప్రజలకు భద్రత కల్పించాలి. రాష్ట్రంలో ఇండ్ల స్థలాలు పోరాట కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో ఇండ్ల స్థలాల పోరాటం చేస్తూ ఇండ్లు నిర్మించుకున్న పేదల ఇండ్లకు పట్టాలివ్వాలి. ప్రభుత్వం పోరాట కేంద్రాల్లోని ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రభత్వాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోమాస ప్రకాష్, కనికరపు అశోక్, జిల్లా కమిటీ సభ్యులు చందు, దుంపల రంజిత్ కుమార్, చెన్నూరు సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎండి. అవిజ్, కోటపల్లి సీపీఐ(ఎం) కార్యదర్శి కావేరి రవి, మరన్న, సీపీఐ(ఎం) సభ్యులు రేణుక, ఉమా, శ్రీనివాస్, నగేష్, సమ్మక్క, జయ, నిర్మల, భూదేవి, సాదిక్, రుక్సానా బేగం, తదితరులు పాల్గొన్నారు.

Spread the love