ధాన్యం దిగుమతిలో జాప్యం చేయొద్దు …

– రైస్ మిల్లులను సందర్శించిన పౌరసరఫరాల చైర్మన్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
రైస్ మిల్లులకు వచ్చిన ధాన్యం దిగుమతిలో జాప్యం చేయొద్దని పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ అన్నారు. గురువారం హుస్నాబాద్ మండలంలోని రైస్ మిల్లులను సందర్శించారు. రైసుమిల్లులలో ధాన్యం దిగుమతులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో వేగం పెంచాల చూడాలని, వెను వెంటనే రైస్ మిల్లులకు తరలించేల చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి బ్రహ్మ రావు ,జిల్లా మేనేజర్ పౌర సరఫరాల సంస్థ హరీష్ కు సూచించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Spread the love