నవతెలంగాణ- పెద్దవంగర: మండలంలోని కొరిపల్లి గ్రామంలో ముత్యాలమ్మ, మైసమ్మ అమ్మవార్లకు భక్తులు ఆదివారం ఘనంగా బోనాలు సమర్పించారు. ఉదయం నుంచి మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పిండివంటలతో పాటు పాయసం తయారు చేసి, బోనాన్ని ఎత్తుకొని డప్పు వాయిద్యాలతో అమ్మవారి ఆలయాల వరకు కాలినడకన బయలుదేరారు. ఉత్సాహంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేపట్టి, మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.