నూతన జాతీయ విద్యా విధానం కాదు ప్రత్యామ్నాయ విద్యా కోసం కేంద్రం అడుగులు వేయాలి..

– ఎస్ ఎఫ్ ఐ..
– రాష్ట్ర యూనివర్సిటీలలో విద్యార్థి ఎన్నికలను నిర్వహించాలి..
నవతెలంగాణ- డిచ్ పల్లి
కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం-2020 ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ యూనివర్సిటీలను నీర్వీర్యం చేసి విదేశీ యూనివర్సిటీలను తీసుకురావడం దారుణమని, నూతన జాతీయ విద్యా విధానం అమలు అయితే విద్యార్థులకు విద్య అందనీ ద్రాక్షగా మారే అవకాశం ఉందని రాష్ట్ర అధ్యక్షులు (ఓయూ రీసర్చ్ స్కాలర్) ఆర్.ఎల్ మూర్తి అన్నారు. అదివారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ యూనివర్సిటీ కమిటీ విస్తృత స్థాయి సమావేశం యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించారు. ఈ సమావేశానికి సంధ్యారెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ మధ్య కాలంలో మృతి చెందిన అమరులకు సంతాపం తెలియజేసీ సమావేశం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు (ఓయూ రీసర్చ్ స్కాలర్) ఆర్.ఎల్ మూర్తి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం-2020 ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ యూనివర్సిటీలను నీర్వీర్యం చేసి విదేశీ యూనివర్సిటీలను తీసుకురావడం దారుణమని అన్నారు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం అమలు అయితే విద్యార్థులకు విద్య అందనీ ద్రాక్షగా మారే అవకాశం ఉందన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలలో పేద విద్యార్థుల కోసం రిజర్వేషన్లను అమలు చేయకుండా ఇష్టానుసారంగా ఫీజులను పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన జాతీయ విద్యా విధానం రద్దు కోసం అనేక పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ విద్యా విధానం కోసం అడుగులు వేయాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీ కి రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్ ని నియమించాలని డిమాండ్ చేశారు. . ఇన్చార్జ్ వైస్ చాన్సలర్ గా ఉన్న వాకటి కరుణ గారు  విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన కరుణించాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర యూనివర్సిటీలలో విద్యార్థి ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. అదేవిధంగా వర్సిటీలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి వలె అనే చందంగా తయారైంది వాపోయారు. వెంటనే అడ్మినిస్ట్రేషన్ యంత్రాంగం క్యాంటీన్ ని ప్రారంభించాలి అని ఓపెన్ జిమ్లను స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా లైబ్రరీని 24/7 గంటలు విద్యార్థుల సౌకర్యం కోసం ఓపెన్ చేసి ఉంచాలని అన్నారు. అదేవిధంగా లైబ్రరీలో కాంపిటేటివ్ మరియు యుజిసి నెట్ సెట్ ల కు సంబంధించి పుస్తకాలను అందుబాటులో ఉంచాలని అన్నారు. అదేవిధంగా  క్యాంపస్ లో చదివే ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ ను కల్పించాలని అదే విధంగా ప్లేస్మెంట్ సెల్ ని, కాంపిటేటివ్ సెల్ ని ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ నూతన కార్యదర్శిగా వెంకటేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కర్యదర్శులు రాచకొండ విఘ్నేష్, అనిల్, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు సంధ్య రెడ్డి, సాయి ప్రసాద్, సహాయ కార్యదర్శలు దినేష్, ఆదిత్య, చాత్రు,చరణ్, నాయకులు మహేష్, శ్రావణి, అస్స్మిత్, పవన్, అనంత్ రావు, తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love