వరద బాధితులకు కాంగ్రెస్ నిత్యవసర సరుకులు అందజేత

నవతెలంగాణ -తాడ్వాయి
ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు నిస్సహాయులైన లవ్వాల, కొండపర్తి గ్రామాల వరద బాధిత కుటుంబాలకు ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ఆధ్వర్యంలో లవ్వాల గ్రామంలో 40 కుటుంబాల, కొండపర్తి గ్రామంలో 60 వరద బాధిత కుటుంబాలకు, 100 కుటుంబాలకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి అందజేశారు. రోజులకు సరిపడా నిత్యవసర సరుకులతో పాటు, 2 గంజులు, 2 గ్లాసులు, 2 గంటెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వంతు సహాయ సహకారంగా వరద బాధితులకు అందించామని తెలిపారు. ఇంకా అర్ధ బాధితులకు సాయం చేసేవారు, సహాయం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, పిఏసిఎస్ డైరెక్టర్ యానాల సిద్దిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అర్రెం లచ్చు పటేల్ వరద బాధితులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Spread the love