– సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ
నవతెలంగాణ-పరిగి
అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి రామకష్ణ అన్నారు. శుక్రవారం పరిగి పట్టణ కేంద్రంలో అంగన్‌వాడీల నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరింది. అంగన్‌వాడీలు ఒంటికాలితో సూర్య నమస్కారం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల సంఘం జిల్లా అధ్యక్షురాలు కే నర్సమ్మ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, పి రామకష్ణ మాట్లాడుతూ అంగన్‌వాడీలీను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్కు రూ.10 లక్షలు, హెల్పర్‌కు రూ.5 లక్షలు ఇవ్వాలని, చివరి జీవితంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలపై అధికారుల వేధింపులు ఆపాలని అన్నారు . 2018 అక్టోబర్‌లో కేంద్రం పెంచిన వేతనాన్ని టీచర్లకు రూ.1,500 , హెల్ప్ ర్‌లకు రూ.750, మినీ టీచర్లకు రూ.1,250లు రాష్ట్రప్రభుత్వం ఏరియాస్‌తో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సెక్టార్ లీడర్లు మంజుల, పద్మ, పార్వతమ్మ, మల్లమ్మ, పుల్లమ్మ, ప్రమీల, వరలక్ష్మి, లక్ష్మీ, లలిత, అంబా బారు, సునీత, లలిత, అంగమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.