సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగ పరిరక్షణే ప్రజాస్వామ్యానికి భవిష్యత్ అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ చెప్పారు. ‘రాజ్యాంగ పరిరక్షణ – సవాళ్ళు’ అనే అంశంపై సోమవారం హైదరాబాద్‌లోని సీఐటీయు రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు అధ్యక్షతన సెమినార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ మన దేశంలోనే ఉన్నదని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధి సాధించినప్పటికీ సాటి మనిషిని, మనిషిలాగా చూడలేని దుర్మార్గపు స్థితి నేటికీ కొనసాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కులం, మతం, ప్రాంతం, లింగ బేధం లాంటి సామాజిక రుగ్మతలు మన దేశంలో ప్రజల్ని, కార్మికవర్గ అనైక్యతకు పాలకులు ఉపయోగిం చుకుంటున్నారని చెప్పారు. సమాజంలో అన్నిరకాల దోపిడీ, అణచివేత, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి వీటి నుండి శ్రామిక వర్గాన్ని విముక్తి చేసి, పెట్టుబడిదారీ సమాజానికి ప్రత్యామ్నాయంగా కార్మికవర్గ రాజ్యాన్ని స్థాపించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని భగం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను కార్మికవర్గం ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లికార్జున్, రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను అమల్లోకి తెచ్చి కార్మిక హక్కులను హరిస్తున్నదని విమర్శించారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, మరోవైపు మనువాద మతోన్మాద విధానాలను ఏకకాలంలో అమలు చేస్తూ సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తున్నదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, కూరపాటి రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ. సునీత, హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు దశరథ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణే ప్రజాస్వామ్యానికి భవిష్యత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


