సొసైటీల పాలకవర్గాలను కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు
బాధ్యతలు చేపట్టిన తాడిచెర్ల చైర్మన్ మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బాధ్యతలను మళ్లీ పాత పాలకవర్గాలకే అప్పగించారు. హై కోర్టులో దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు పాత వారినే కొనసాగించాలని ప్రభుత్వానికి సూచి స్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం 2025 డిసెంబర్ 19న ఇచ్చిన పాలకవర్గాల రద్దు జీవోను వెనక్కి తీసుకుంది. కోర్టు ఆదేశాలను అమలు చేయాలని అధికారులకు సమాచారం అందినట్లుగా తాడిచెర్ల సిఈఓ సంతోష్ తెలిపారు. మండల కేంద్రమైన తాడిచెర్ల సొసైటీ చైర్మన్ గా ఇప్ప మొoడయ్య తోపాటు డైరెక్టర్లు బుధవారం బాధ్యతలు చేపట్టారు. పర్సన్ ఇన్చార్జీగా ఉన్న అధికారి చైర్మన్ ఇప్ప మొండయ్య కు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం ఒక పక్క సొసైటీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుండగానే పాత పాలకవర్గాలకు పగ్గాలు ఇవ్వడం చర్చగా మారింది.
పాత వారికే ‘సహకార’ పగ్గాలు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



