దొడ్డు సన్నాల నిల్వల వివరాలు తెలుసుకున్న ఆర్డీఓ : రాజేంద్ర కుమార్
నవతెలంగాణ – దర్పల్లి
ధాన్యం తూకం వేసే విషయంలో రైతులకు ఇబ్బందులు కల్గకుండా త్వరగా పూర్తి చెయ్యాలని ఆర్డీఓ రాజేంద్ర కుమారు నిర్వాహకులు ఆదేశించారు. బుధవారం అయన మండల కేంద్రములోని సొసైటీ ఆధ్వర్యలో కొనసాకుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని, అలాగే హోన్నజిపేట గ్రామములోని కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లో ఇప్పటివరకు తూకం వేసి పంపిన వివరాలు, అలాగే ప్రస్తుతం ఇంకా ఇంత నిల్వలు ఉన్నాయి. వాటిలో దొడ్డు ధాన్యం, సన్నాలు ఎన్ని ఉన్నాయో పూర్తి వివరాలు నిర్వాహకులకు అడిగి తెలుసుకున్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, త్వరగా కొనుగోళ్లు పూర్తి చెయ్యాలని ఆదేశించారు. లారీల కొరత గన్ని బ్యాగుల సమస్య ఏమైనా ఉందా అని అడిగి తెలుసుకున్నారు. దొడ్డు వరి మరో 15నుండి 20 వేల కాంటలు ఉంటాయని, సన్నాలు సుమారు 33 వేల కాంటలు ఉన్నాయని సిబ్బంది ఆర్డీఓ దృష్టకి తెచ్చారు. కార్యక్రమములో అయన వెంట తహసీల్దార్ శాంత, ఆయా గ్రామాల జిపిఓలు సొసైటీల సిబ్బంది రైతులు ఉన్నారు.
కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


