Wednesday, May 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాలలో మళ్ళీ రాజుకున్న 'గోడ' వివాదం:

పరకాలలో మళ్ళీ రాజుకున్న ‘గోడ’ వివాదం:

- Advertisement -

 మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య హెచ్చరిక
వివాదాలకు కేంద్రంగా 20వ వార్డు ప్రహరీ గోడ
గతంలో అధికారులు సస్పెండ్
నవతెలంగాణ – పరకాల 

పరకాల పట్టణంలోని 20వ వార్డులో గత కొంతకాలంగా కొనసాగుతున్న ప్రహరీ గోడ వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. సూర విజయ అనే మహిళ బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తూ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించడం జరిగింది. విజయ మున్సిపల్ కమిషన్కు ఈ తరహా విరుత్పత్రం అందించడం ప్రస్తుతం పట్టణంలో పెద్ద చర్చకు దారితీసింది. గతంలో ఇదే వివాదం కారణంగా ఇద్దరు మున్సిపల్ రికార్డ్ అసిస్టెంట్లు సస్పెండ్ అవ్వడమే కాకుండా, అప్పటి కౌన్సిలర్ ఒకరిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది. ఇంతటి గందరగోళం జరిగిన ఈ అంశంపై మళ్ళీ ఇప్పుడు విజయ ఫిర్యాదు చేయడం వెనుక ఏదైనా బలమైన రాజకీయ శక్తి ఉందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ఐతే బాధితురాలినని చెప్పుకుంటున్న సూర విజయ ఆత్మహత్య హెచ్చరిక జారీ చేయగా, దీనిపై ఎదుటి పక్షమైన మంద సునీత కుటుంబ సభ్యులు భిన్నమైన వాదనను తెరపైకి తెచ్చారు.గతంలో సూర విజయ చేసిన రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు, తమ కట్టడం అక్రమమని భావించి తొందరపాటుతో కూల్చివేశారని వారు పేర్కొంటున్నారు. ఆ తర్వాత తాము టౌన్ ప్లానింగ్ అధికారులకు అన్ని రకాల భూమి పత్రాలను, సరైన ఆధారాలను సమర్పించామని, ఆ డాక్యుమెంట్లను పరిశీలించి అధికారులు సంతృప్తి చెందిన తర్వాతే తిరిగి కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నామని సునీత కుటుంబం స్పష్టం చేస్తోంది.

 తెర వెనుక రాజకీయాలు? రీ-మెజర్మెంట్స్ కోరుతున్న విశ్లేషకులు

సంవత్సర కాలం తర్వాత సూర విజయ ఏకంగా ఆత్మహత్య హెచ్చరిక వరకు వెళ్లడం వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంబంధిత టీపీఓ తనను బెదిరించారని విజయ ఆరోపిస్తుండగా, క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి ఎవరైనా తెరవెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారా అని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ వివాదం రోజురోజుకూ ముదురుతుండటంతో మున్సిపల్ యంత్రాంగం మరియు పోలీసులు సమగ్ర విచారణ జరిపి, అసలు నిజానిజాలను బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివాదాస్పద స్థలాన్ని సర్వే చేయించి రీ-మెజర్మెంట్స్ తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ చిక్కుముడి వీడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -