నవతెలంగాణ కథనానికి స్పందన..పాఠశాలలో చేరిన టీచర్

– ఆర్డర్ ఇచ్చిన ఎంఈఓ 
– హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు
నవతెలంగాణ-మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావు పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ,ఆ టీచర్ రిలీవ్ అయినట్లా.?..కానట్లా.? అనే కథనం ఈనెల 14న నవ తెలంగాణ దినపత్రిక వరంగల్ ఎడిసిన్ లో ప్రచురించిన సగతి తెలిసిందే. ఈ కథనానికి ఎట్టకేలకు విద్యాశాఖ అధికారులు స్పందించి అక్టోబర్ 3న రిలీవైన ఆ టీచర్ ను మూడు నెలల తరువాత యదస్థానంలోకి వెళ్లి విధులు నిర్వహించాలని శనివారం మండల ఎంఈఓ దేవా నాయక్ ఆర్డర్ ఇచ్చినట్లుగా తెలిపారు. మూడు నెలలపాటుగా పాఠశాలలో ఒక్క టీచర్ మాత్రమే ఉండటంతో విద్యార్థులకు బోధన విషయంలో ఇబ్బందులు కలిగాయని,ప్రస్తుతం పాత టీచర్ మళ్ళీ పాఠశాలకు రావడంతో  విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.తమ సమస్యపై పత్రికలో ప్రచురించి విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకపోయి పరిసర్కారమైయ్యేoదుకు కృషి చేసిన నవ తెలంగాణ దినపత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అసలు ఎం జరిగిందంటే..
అక్టోబర్ నెలలో గత ప్రభుత్వం జివో 317 ప్రకారం నామ్స్ 1నుంచి 19 వరకు విద్యార్థులు ఉన్న ఉపాధ్యాయులు తమ అనుకూలమైన ప్రదేశాలకు బదిలీలు పెట్టుకోవచ్చని ప్రకటించిన నేపథ్యంలో రామారావు పల్లి పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయురాలు రామారావు పల్లి పాఠశాలలో నామ్స్ లోపు విద్యార్థులు ఉన్నారని క్లస్టర్ హెచ్ ఎం సమాచారం ఇచ్చి రిలీవ్ పెట్టారు.వెంటనే హెచ్ ఎం పాఠశాలను సందర్షించగా పాఠశాలలో 35 మంది విద్యార్థులకు పైన ఉన్నారు.వేంటనే  హెచ్ ఎం మండల విద్యాధికారికి సమాచారం ఇవ్వడంతో  ఎంఈఓ సైతం పాటశాలను సందర్షించగా పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉన్నట్టుగా తెలిసింది.తప్పుడు సమాచారంతో రిలీవ్ పెట్టుకున్న ఆ ప్రధానోపాధ్యాయురాలు రిలీవ్ ఆర్డర్ ఆపాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎంఈఓ సమాచారం ఇచ్చినట్లుగా తెలిపారు.రిలీవ్ పెట్టుకున్న ప్రధానోపాధ్యాయురాలు మాత్రం భూపాలపల్లి జిల్లాలోని గన్ పూర్ మండలంలో విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో నవ తెలంగాణ కథనంతో ఉలిక్కిపడ్డ విద్యాశాఖ అధికారులు ఒక్కటై నీవు తాడిచెర్ల పాఠశాలలోనే విధులు నిర్వహించాలని ఆర్డర్ చేసినట్లుగా తెలిసింది..కానీ సత్యాలు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు అసత్యపు మాటలు చెప్పి రిలీవ్ కోసం దరఖాస్తు పెట్టుకున్న ఆ టీచర్ పై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
Spread the love