ఈదురు గాలుల బీభత్సం..లేచిపోయిన ఇంటి పైకప్పులు

నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండలం బట్టుగూడెం పంచాయతీ పరిధిలోని ముసలమ్మచెట్టు స్టేజివద్ద ఈదురు గాలులు  బీభత్సం సృష్టించాయి. ఆదివారం సాయంత్రం బట్టుగూడెంకొత్త గూడెం పెద్దవూర, వీచిన గాలి దుమారం కి ఇంటి పైకప్పులు లేచిపోయాయి. భారీ ఈదురు గాలులకు సుమారు 9 ఇళ్లపై వేసుకున్న సిమెంట్, ఇనుప రేకులు వీధులలో చిందరవందరగా పడిపోయాయి. పలువురు ఇళ్లలో గృహపకరణాలు రోడ్డు బయటికి వచ్చాయి. ముసలమ్మ చెట్టు స్టేజీ వద్ద కూరాకుల వేంకటయ్య ఇంటి రేకులు పూర్తిగా లేచి పోయి దూరంగా పడిపోయాయి. దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడ రోడ్డుకు అడ్డంగా చెట్లు కూలడంతో రాకపోకలకు ఆటంకం కలిగింది. అధికారులు సత్వరమే చర్యలు చేపట్టి విద్యుత్ సరఫరా చేశారు.
Spread the love