గుర్తు తెలియన వ్యక్తులు బత్తాయి చెట్ల నరికివేత

– గుర్తు తెలియని వ్యక్తులు నరికిన 170 బత్తాయి చెట్లు
– భూ తాగాదాలే కారణం అంటున్న బాధితుడు
– శనివారం అర్ధరాత్రి ఘటన
– తనకు న్యాయం చేయాలని వినతి
 నవతెలంగాణ -పెదవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం ఉట్లపల్లి గ్రామ రెవెన్యూ శివారులోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 291 లో బోదాసు మల్లయ్య, బోదాసు సత్తెయ్య కు సంబందించిన 6.20 ఎకరాలు భూమి వుంది. అయితే రెండు సంవత్సరాల క్రితం బోదాసు మల్లయ్య తనకు ఉన్న భూమిలో దొండ తోటలో 230 బత్తాయి చెట్లు నాటాడు. 290 సర్వే నంబర్ లో భూతరాజు సాయన్న వ్యవసాయ భూమి వుంది. అయితే గత 19 ఏళ్ల క్రితం బోదాసు మల్లయ్యకు భూమిలో ఉన్న దానికంటే ఎక్కువ భూమి ఉందని 2005 లో కొలిపించారు.అందులో 31 గుంటల భూమి ఎక్కువ వుంది. అయితే 14000 లరూపాయలు అప్పట్లో సాయన్నకు పెద్దమనుషులు సమక్షంలో మల్లయ్య చేత ఇప్పించారు. అప్పటినుంచి ఈ సమస్యకు తెర పడింది. ధరణి వచ్చిన తరువాత మల్లయ్య 31 గుంటల భూమి సాయన్న భూరికార్డు లోకి ఎక్కింది. దాంతో సంవత్సరం కాలంగా ఇద్దరి మధ్య మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆర్డరాత్రి మల్లయ్య నాటిన 170 బత్తాయి చెట్లను  నరికి వేశారని బాధిత రైతు మల్లయ్య తెలిపారు.శనివారం బాధితుడు మల్లయ్య నరికిన చెట్లను చూసి రోదిస్తూ అనుమానితులపై స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశామని తెలిపారు.ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరారు.
– నాకు న్యాయం చేయాలి.. బోదాసు మల్లయ్య – ఉట్లపల్లి290 సర్వేనంబర్ లో నేను నాటిన 170 బత్తాయి మొక్కలు నాటాను. కొందరు అనుమాననితులు
శుక్రవారం అర్ధరాత్రి మొక్కలను నరికేశారు. సాయత్రం ఆరు గంటలవరకు తోట వద్దనే వున్నాను. ఆతరువాత 10 గంటలకు గేట్ వాల్ తిప్పుటకు వెళ్లాను అప్పుడు కూడ బాగానే వుంది. తెల్లవారు జామున 5 గంటలకు తోట వద్దకు వెళ్లి చూడగా బత్తాయి మొక్కలు నరకబడి వున్నాయి. నాకు న్యాయం చేయాలని కోరారు.
Spread the love