Monday, August 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలి

కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలి

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని హెచ్ కేలూర్ గ్రామ కార్యదర్శి విజయ్ కుమార్ షిండే నిర్లక్ష్యం కారణంగా మా ఊరంతా చిచ్చు తగులుతుందని, ఇలాంటి కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేసి, కొత్త కార్యదర్శిని నియమించి గ్రామ ప్రశాంతతకు సహకరించాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన పలువురు మండల పరిషత్ కార్యాలయానికి తరలివచ్చి ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మా గ్రామంలోని బీసీ కాలనీలో అక్రమంగా షెడ్డు నిర్మించుకున్న ఊరిలో గడ్డి వార్ వీరేశంకు నోటీసులు ఇవ్వగా ఆయన అక్రమ కబ్జాదారులందరి షెడ్లు తొలగించాలని ఫిర్యాదు చేయడంతో కార్యదర్శి పలువురికి నోటీసులు ఇవ్వడం ఏండ్ల తరబడి ఇంటి పన్ను కడుతూ ఉంటున్నామని అసలైన విషయం గడ్డివార్ వీరేశం అనే వ్యక్తి గ్రామపంచాయతీ స్థలంలో అక్రమంగా షెడ్డు నిర్మాణం చేసుకున్నాడని, అలాంటి వ్యక్తిపై పంచాయతీ కార్యదర్శి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేక మా గ్రామస్తుల మధ్య పంచాయతీ సెక్రెటరీ చిచ్చు పెట్టి పెద్ద పెద్ద గొడవలు జరిగేటట్లు చేస్తున్నాడని తెలిపారు.

మా ఊరు సెక్రటరీ వల్ల మా గ్రామంలో మనశ్శాంతి లేకుండా ఉంటున్నామని, మాకు ఈ పంచాయతీ సెక్రెటరీ వద్దు ఇతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని అన్నారు. అలాగే మంచి సెక్రటరీ నియమించి మా గ్రామ ప్రశాంతతకు చక్కదిద్ది మా గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా చూడాలని ఎంపీడీవోకు అందజేసిన ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు. ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన వారు మామిల్వార్ గోదావరి బాయి, శ్రీనివాస్ మల్దొడ్డి వార్, ఆజముద్దీన్, గణేష్ మాధవరావు పాంచాల్, సంగ్రామ్ నాగురావ్ గజ్జల్ వార్, గంగులవార్ రమేష్, సాయిలు మామిడి వార్, రమేష్ మాధవరావు పాంచాల్, వీరంతా గ్రామ కార్యదర్శి పై ఫిర్యాదు చేస్తూ మా గ్రామం ప్రశాంతంగా ఉండడానికి కార్యదర్శి పై చట్టపరమైన చర్యలు తీసుకొని కొత్త గ్రామ కార్యదర్శి నియమించి సహకరించాలని వారు కోరారు. గ్రామస్తుల ఫిర్యాదుకు ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -