Monday, August 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వాలంటీర్లు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలి

వాలంటీర్లు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలి

- Advertisement -

ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురులో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ముక్కెర ప్రకాష్ బాబు
నవతెలంగాణ-నెల్లికుదురు 

ప్రతి ఒక  వాలంటీర్లు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ముక్కెర ప్రకాష్ బాబు అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురులో ఎన్ఎస్ఎస్ యూనిట్–I, యూనిట్–II ప్రోగ్రామ్ ఆఫీసర్లు మర్సకట్ల అనిల్ కుమార్, పెద్దూరి వెంకటేశ్వర్ ల ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ముక్కెర ప్రకాష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్ఛమైన పరిసరాలు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు పరిశుభ్రతను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకొని, సమాజంలో కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాల ఆవరణను శుభ్రపరిచి, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం సభ్యులు కవిరాజ్, రఘురామ్, మహేందర్, శ్రీనివాస్, యాకన్న, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -