సేవకు మారుపేరు వాసవి క్లబ్

– వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రి
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
సేవకు మారుపేరు వాసవి క్లబ్ అని, సేవా కార్యక్రమాలు సమాజంలో శాశ్వతంగా నిలిచేలా ఉండాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రి పేర్కొన్నారు.తొర్రూరు వాసవి క్లబ్, వనితా క్లబ్ ల ఆధ్వర్యంలో మంగళవారం  ‘వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్’ కార్యక్రమం చేపట్టారు.వాసవి క్లబ్ అధ్యక్షుడు వజినెపల్లి అనిల్ కుమార్, వనితా క్లబ్ అధ్యక్షురాలు వజినెపల్లి దీపల నిర్వహణలో చేపట్టిన కార్యక్రమానికి గాయత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్యవైశ్యుల సామూహిక శక్తికి, సేవకు వాసవి క్లబ్‌ దోహదపడుతుందన్నారు. సేవా కార్యక్రమాలను విస్తరించాలని కోరారు. ధర్మము, త్యాగము, సేవా కార్యక్రమాల్లో ముందుండేది వైశ్యులేనని తెలిపారు. ఆర్యవైశ్యులు సమాజ హితం కోసం పాటుపడతారనే పేరు ఉందని, ఆ పేరును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా ప్రాంతాల అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర ఉంటుందని, వ్యాపార రంగంలో రాణిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు.
    ఆర్యవైశ్యులు అంటే కులం కాదని.. కుటుంబమని, ఆర్యవైశ్యులంతా వాసవి క్లబ్ లను ను బలోపేతం చేసుకోవాలన్నారు.అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాలన్నారు. తొర్రూరు వాసవి క్లబ్, వనిత క్లబ్ ల బాధ్యులు అనిల్ కుమార్,  దీపలు ఉత్తమంగా పనిచేసి క్లబ్ లను ముందు వరసలో నిలిపారని గుర్తు చేశారు. ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ తొర్రూరు క్లబ్ ల పనితీరును గుర్తించిందని, అన్ని ప్రాంతాల క్లబ్ లకు స్పూర్తి దాయకంగా నిలిచారని తెలిపారు.అనంతరం వాసవి క్లబ్ కేసిజీఎఫ్ సిల్వర్ స్టార్ అన్నపూర్ణ, వాసవి క్లబ్ కపుల్స్ పేరిట రెండు నూతన క్లబ్ లను ఏర్పాటు చేశారు.వాసవి క్లబ్ కేసీజీఎఫ్ సిల్వర్ స్టార్ అన్నపూర్ణ అధ్యక్షులుగా మచ్చ సురేష్, ప్రధాన కార్యదర్శిగా రేణికుంట్ల విశ్వ ప్రసాద్  , కోశాధికారిగా రేవూరి శ్రీనివాస్ లు నియమితులయ్యారు.వాసవి క్లబ్ కపుల్స్ అధ్యక్షులుగా కొమురవెల్లి లింగమూర్తి- మాధవి దంపతులు, ప్రధాన కార్యదర్శులుగా చిదిరాల కృష్ణమూర్తి- విజయలక్ష్మి దంపతులు, కోశాధికారులుగా వెంకటేష్ – భవ్య దంపతులు ఎన్నికయ్యారు.నూతన ప్రతినిధులను వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ రవ్వ గీత, గార్లపాటి శ్రీనివాస్ లు ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్  పాలకుర్తి గాయత్రి,ఐఐసి ఆఫీసర్ గార్లపాటి శ్రీనివాస్ డిస్టిక్ గవర్నర్ రవ్వ గీత, క్యాబినెట్ ట్రెజరర్ శ్రీరామ్ శైలజ,  వైస్ గవర్నర్ గంప సాంబమూర్తి, గోపరపు రామా ఉపేందర్ జిల్లా క్లబ్ ఇన్చార్జి  ప్రొద్దుటూరు గౌరీ శంకర్ ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సామరామూర్తి,, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్, మచ్చ సోమయ్య పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బిజ్జాల అనిల్, జిల్లా సభ్యులు ఇమ్మడి రాంబాబు  తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ విద్యాసంకల్ప కార్యక్రమానికి ఆర్థిక చేయూత అందించిన వనమాల నాగేశ్వరరావుకు భారీ షీల్డ్ అందించి ఘనంగా సత్కరించారు.
Spread the love