బిస్లరీ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా కదం తొక్కిన కార్మికులు
యాజమాన్యం దిగిరాకపోతే ఉద్యమం ఉధృతం : సంఘీభావ సభలో వక్తలు
పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ ప్రదర్శన
నవతెలంగాణ-పటాన్ చెరు
బిస్లరీ పరిశ్రమలో అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదని సీఐటీయూ నేతలు స్పష్టం చేశారు. చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేస్తూ 45 రోజులుగా సమ్మె చేస్తున్న బిస్లరీ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని పాశమై లారం పారిశ్రామిక వాడలో కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. పాశమైలారం ఇండస్ట్రియల్ క్లస్టర్ కన్వీనర్ బిస్లరీ యూనియన్ అధ్యక్షులు అతిమేల మానిక్ అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జి.సాయిలు, జిల్లా కోశాధికారి కే.రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పి.పాండురంగారెడ్డి, పి.భాగారెడ్డి మాట్లాడుతూ.. బిస్లరీ యాజమాన్యం చట్టాలను ఉల్లంఘిస్తుంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు. కార్మికులు చట్టబద్ధంగా యూనియన్ పెట్టు కోవడమే నేరమా అని ప్రశ్నించారు. శాంతియుతంగా 45 రోజులుగా సమ్మె చేస్తుంటే యాజమాన్యం ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి కార్మికులను భయభ్రాంతులకు గురి చేయటం ఎంతవరకు న్యాయమన్నారు.
పట్టుదలతో పోరాడుతున్న బిస్లరీ కార్మికులకు జేజేలు పలికారు. కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని, యావత్ కార్మికవర్గం అండగా ఉద్యమిస్తుందని హెచ్చరించారు. బిస్లరీ కార్మికులకు మద్దతుగా సంగారెడ్డి జిల్లాలోని కార్మికులను కదిలించి పోరాటాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు. లగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలని, యాజమాన్యం దిగివచ్చి చర్చలు జరిపి వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. సంఘీ భావ ప్రదర్శన, సభలో పాల్గొన్న వివిద యూని యన్లు మద్దతు పలి కాయి. సాండ్విక్ యూనియన్ జనరల్ సెక్రెటరీ ప్రదీప్, కిర్బి ఉపాధ్యక్షులు మల్లేష్, సెనర్జీ జనరల్ సెక్రె టరీ శాంత్ కుమార్, సిబిఎల్ జనరల్ సెక్రెటరీ ప్రసన్న, కోహెన్స్ ఫార్మా జనరల్ సెక్రెటరీ వెంకటేష్, పార్లే జనరల్ సెక్రెటరీ సంతోష్ గౌడ్, నీయఫ్ నాయకులు శంకర్, హిమ్ జల్ దామోదర్, టీఐడీసీ వెంకటేష్, ప్రజానాట్యమండలి అధ్యక్షులు రాజు, కార్య దర్శి నాగభూషణం సంఘీభావం తెలిపారు. ఈ కార్య క్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సుధాకర్, నాయకులు, వివిధ యూనియన్ల కార్మికులు పాల్గొన్నారు.



