తెలంగాణలో రాబోయేది బిఎస్పీ సర్కారే.. ఆర్ఎస్పీ కాబోయే సీఎం..

– రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయి,

– యూపీ తరహాలో తెలంగాణలోనూ బీఎస్పీని ఆదరించాలి,
– వట్టే జానయ్య గెలుపు ఖాయం.. జాతీయ అధ్యక్షురాలు మాయావతి.
నవతెలంగాణ-సూర్యాపేట: తెలంగాణలో రాబోయేది బిఎస్పీ సర్కారేనని బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఎస్పి అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం సూర్యాపేట లోని గాంధీ నగర్ లో జరిగిన భహిరంగ సభలో ఆమె మాట్లాడారు. దేశంలో కాంగ్రేసు, బీజేపీ, బీఆర్ఎస్ లు సంపన్న వర్గాల కోసం పనిచేస్తున్నాయని కానీ బిఎస్పి మాత్రం బహుజన వర్గాల కోసం ప్రజల విరాళాలతో నడుపబడుతున్న ఏకైక పార్టీ అని పేర్కొన్నారు. సబ్బండవర్గాలకు అండగా ఉండేది బీఎస్పీ పార్టీనే అని ఈ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవని.. భ్రష్టాచార్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో శాంతి భద్రతలు క్షిణించాయని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ మాదిరి తెలంగాణలో కూడా బహుజన సమాజ్ పార్టీని ఆదరించాలని మాయావతి కోరారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వకుండా  అవమానించిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు.అనంతరం విపి సింగ్ పాలనలో మెడలు వంచి పోరాటం చేసి కాంగ్రెసు వ్యతిరేకించిన అంబెడ్కర్ కు భారత రత్న సాదించినామని స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించినా.. వాటిని అమలు చేయట్లేదని విమర్శించారు. మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ కోటా ఉండాలని.. మొదటి నుంచి బీఎస్పీ ఈ విషయం చెప్తోందన్నారు. ప్రధానంగా  అంబేడ్కర్, కాన్షీరామ్ కలలను మనం సాకారం చేయాలని గుర్తు చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ఐపీఎస్ను వదిలి.. ప్రజల సేవ కోసం వచ్చారని తెలిపారు. పార్టీని గెలిపించి ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని సూచించారు. బీఎస్పీని దక్షిణాదిలోనూ విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు వినూత్న తీర్పు ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు. తమ పార్టీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పై జరిగిన దాడి సంపన్న వర్గాలైన బీఆర్ఎస్, కాంగ్రెసులు జరిపించిన దాడులని మండిపడ్డారు. జానయ్య బహుజన జండాను ఎత్తుకోవటం ఆహ్వానించ దగినదని అభినందించారు. బిఎస్పి అధిక స్థానాల్లో గెలవబోతుంది. ఆర్.యస్ ప్రవీణ్ కుమార్.. ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలవబోతోందని రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జానయ్య ఏర్పాటు చేసిన సభను విఫలం చేయడానికి మంత్రి, పోలీసులు ప్రయత్నాలు చేసిన ప్రజలు భారీగా తరలివచ్చారని కొనియాడారు. బిసి వాదం ఎత్తుకున్నందుకు జానయ్య పై మంత్రి జగదీష్ రెడ్డి 70 కి పైగా కేసులు పెట్టించారని విమర్శించారు. అయినా ప్రజల మద్దతు ఉన్న జానయ్య గెలుపు ను ఆపడం మంత్రి తరం కాదని అన్నారు. అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ చావు నోట్లో కి వెళ్లి ప్రజల ఆశీర్వాదం తో తిరిగి వచ్చానని చెప్పారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అగ్ర వర్ణాల అభ్యర్థులపై తన గెలుపు ఖాయమని పేర్కొన్నారు. మంత్రి ఎన్ని రకాలు గా ఇబ్బందులు పెట్టిన తగ్గేదె లేదని స్పష్టం చేశారు. సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love