నాగార్జున సాగర్ బీజేపీ అభ్యర్థిగా నివేదిత రెడ్డి


నవతెలంగాణ -పెద్దవూర: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామానికి చెందిన కంకణాల నివేదిత రెడ్డి పేరు ఖరారైంది. ఈ మేరకు ఈ నెల 22న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు ప్రకటించారు. ఆమె భర్త కంకణాల శ్రీధర్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు పెద్దకూతురు కావ్యశ్రీ ఇంటర్ నేషనల్ చెస్ ప్లేయర్, చిన్న కూతురు కీర్తిశ్రేయ జాతీయ స్థాయిలో బాస్కెట్ బాల్ ప్లేయర్, ఈమె 10 ఏండ్లుగా మండల కేంద్రంలో విశ్వనాథ్ స్పిన్నింగ్ పరిశ్రమ ఏర్పాటు చేసి 1500 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 2017లో విస్ వేశ్వ రాయనేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలాజీ స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు చేయూతను అందించారు. ఆ తరువాత 2018 లో సాగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసీ ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంటింటికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.దీంతో ఎలాగైనా ఎన్నికల రంగంలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవాలని పట్టుదలతో ఆమె పావులుకదిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ సమయానుకూలంగా రాజకీయ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి వుంటూ అధిష్టానం దృష్టిలో స్థానం సంపాదించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలో ఆమెకు సీటు ఖరారు కావడం తో మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేశారు.

Spread the love