ముదిరాజుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

– ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
నవతెలంగాణ- ధర్మసాగర్:
ముదిరాజుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్ లో బుధవారం చేప పిల్లల విడుదల చేసి, అనంతరం ముదిరాజులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ముదిరాజుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల 56 వేల చేప పిల్లలను ఏట విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు లాంచిన ప్రయంగా 36వేల చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందన్నారు. నా బూతు నా భవిష్యత్తు అనే సూక్తితో ముదిరాజులు నాటికి నేటికి చాలా అభివృద్ధిలో ముందంజలో ఉన్నారన్నారు. ఉచిత చేప పిల్లలనే కాకుండా వాటిని పట్టేందుకు వలలు ఇతర రాత్ర సామాగ్రి అందిస్తూ వారి అభివృద్ధికి ప్రభుత్వం  పాటుపడుతుంది అన్నారు. ప్రమాదవశాత్తు ముదిరాజులు చనిపోతే ప్రభుత్వం ఐదు లక్షలు రూపాయలు అందిస్తుందన్నారు. రాష్ట్రంలోనే ముదిరాజులు ముందుండాలని లక్ష్యంతో  తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ముదిరాజుల అధ్యక్షులు సురుగురు శ్రీనివాస్, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ పిట్టల సత్యనారాయణ, టిఆర్ఎస్ మండలాధ్యక్షులు సర్పంచ్ మునిగేల రాజు, కర్ర సోమిరెడ్డి, మునిగల శోభ, ఎంపీటీసీలు రొండీ రాజు, బొడ్డు శోభ సోమయ్య, పిఎసిఎస్ వైస్ చైర్మన్ యాద కుమార్, లాల్ మొహమ్మద్, మత్స్యశాఖ డీఈ విజయలక్ష్మి, ముదిరాజులు అశోక్, సదానందం, బాలరాజు తదితరులు పాల్గొన్నారు
Spread the love