నవతెలంగాణ- పాన్‌గల్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శ్రమదానం కార్యక్రమం భాగం పానగల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాలో ఆదివారం తెలంగాణ గిరిజన సంఘం ఐద్వ మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. గ్రామ సర్పంచ్ శాంతమ్మ తెలంగాణ గిరిజన జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్యనాయక ప్రారంభించారు అనంతరంగ్రామంలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో పిచ్చి ముక్కులు తొలగించడం, రోడ్లుడ్రైనేజ్,పరిశుద్దం చేయించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శాంతమ్మ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏం బాల్య నాయక్ మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రం శ్రమదానం అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు ప్రజలకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి నర్మదా, మహిళా సంఘాలు నాయకురాలు శాంతమ్మ ,సాలమ్మ, నీలమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ సోమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.