టికెట్ల కేటాయింపుల్లో ఎలాంటి ఇబ్బంది లేదు

–  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. రాష్ట్రంలో 70 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తోందన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌ నుంచి ఆయన జూమ్‌మీటింగ్‌లో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న స్థానాలకు వెంటనే ప్రకటిస్తామన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌కు వచ్చిన వాతావరణమే ఇక్కడ కూడా కనిపిస్తోందన్నారు. తెలంగాణలో అవినీతి పాలనకు కాంగ్రెస్‌ చరమగీతం పాడబోతుందని తెలిపారు. కాంగ్రెస్‌లో ఎలాంటి గ్రూపులు లేవన్నారు. అందరూ కలిసికట్టుగా పని చేస్తున్నారని చెప్పారు.

Spread the love