నేను పార్టీ మారట్లేదు : అద్దంకి దయాకర్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత అద్దంకి దయాకర్‌ ఖండించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ తరఫున తుంగతుర్తి అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్‌ వేయనున్నట్టు ప్రకటించారు. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారం…బీఆర్‌ఎస్‌లోని కొంత మంది తనపై చేస్తున్న కుట్రలో భాగమేనని విమర్శించారు. ఆ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం తనకు అండగా ఉందనీ, బీఫాం ఇస్తుందని ధీమావ్యక్తం చేశారు. తుంగతుర్తిలోని తమ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో కలిసి శుక్రవారం నామినేషన్‌ వేస్తానని ఆయన చెప్పారు.

Spread the love