నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు శాసనసభ మంగళవారం నాటి సమావేశాల్లో తీవ్ర వాదోపవాదాలు, నాటకీయ పరిణామాల మధ్య అట్టుడికింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్, ప్రతిపక్ష డీఎంకే మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. ముఖ్యమంత్రి ప్రసంగానికి నిరసనగా డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ, డీఎంకే పార్టీ పేరుతో అక్రమంగా నిధులు సేకరిస్తోందని ఆరోపించడంతో పాటు, అవినీతికి పాల్పడిన వారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనల్లో వాస్తవం లేదని, అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆయన విమర్శించారు. విజయ్ ప్రసంగానికి డీఎంకే సభ్యులు పదేపదే అడ్డుతగలడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ, డీఎంకే సభ్యులు నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
అవినీతి కేసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: సీఎం విజయ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



