ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..

నవతెలంగాణ – అమరావతి:  ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. హోం శాఖ మంత్రి గా వంగలపూడి అనితకు అవకాశం కల్పించారు చంద్రబాబు. ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ కు ఇచ్చారు. ఇలా కీలక శాఖలన్నీయూ… టీడీపీ శాఖ తీసుకుంది. ఈ శాఖల కేటాయింపుల్లో జనసేనకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఇందులో పవన్ కళ్యాణ్‌ కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది.  అంతేకాదు… పవన్ కళ్యాణ్‌ కు డిప్యూటీ సీఎం పదవి తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా పదవులు కూడా దక్కాయి . అయితే.. ఇక్కడ జనసేన పార్టీ వా రికి కీలక పదవులు దక్కలేదు. నాదెండ్ల మనోహర్ కు పౌరసరఫరాల శాఖ మాత్రమే ఇచ్చారు. కందుల దుర్గేష్ కు పర్యావరణం, సాంస్కృతిక శాఖ ఇచ్చి చేతులు దులుపుకున్నారు చంద్రబాబు. కానీ చంద్రబాబు వద్ద సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు ఉన్నాయి.
మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..
* చంద్రబాబు – సీఎం, సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు.
* పవన్ కళ్యాణ్ – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ
* నారా లోకేశ్ – మానవవనరులు, ఐటీ ఎలక్ట్రానిక్ష్&కమ్యునికేషన్.
* అచ్చెన్నాయుడు – వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక
* నాదెండ్ల మనోహర్ – ఆహార, పౌరసరఫరాలు
* వంగలపూడి అనిత – హోంమంత్రి, విపత్తు నిర్వహణ
* గొట్టిపాటి రవికుమార్ – విద్యుత్ శాఖ
* టీజీ భరత్ – పరిశ్రమలు
* జనార్ధన్ రెడ్డి – రోడ్లు, భవనాలు
* గుమ్మడి సంధ్యారాణి – మహిళా, శిశుసంక్షేమం, గిరిజన సంక్షేమం
* కందుల దుర్గేశ్ – పర్యాటకం, సినిమాటోగ్రఫీ
* రాంప్రసాద్ రెడ్డి – ట్రాన్స్‌పోర్ట్, యువజన & క్రీడలు
* కొండపల్లి శ్రీనివాస్ – MSME, సెర్ప్, NRI ఎంపవర్‌మెంట్
* ఎస్.సవిత – బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్&టెక్స్‌టైల్స్
* సత్యకుమార్ యాదవ్(BJP) – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య
* కొల్లు రవీంద్ర – ఎక్సైజ్, గనులు, జియాలజీ
* పొంగూరు నారాయణ – మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి
* నిమ్మల రామానాయుడు – జలవనరుల శాఖ
* ఎన్.ఎం.డీ ఫరూక్ – న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం
* ఆనం రామనారాయణరెడ్డి – దేవాదాయశాఖ
* పయ్యావుల కేశవ్ – ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు&అసెంబ్లీ వ్యవహారాలు
* అనగాని సత్యప్రసాద్ – రెవెన్యూ, రిజిస్ట్రేషన్& స్టాంప్స్
* కొలుసు పార్థసారథి – హౌసింగ్, I&PR
* D B స్వామి – సాంఘిక సంక్షేమం, వృద్ధులు&వికలాంగుల సంక్షేమం, సచివాలయం&గ్రామీణ వాలంటీర్
* వాసంసెట్టి సుభాష్ – లేబర్, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్

Spread the love