Sunday, May 3, 2026
E-PAPER
Homeసినిమాఆ సిద్ధయ్య నువ్వేనా..? అని అడుగుతున్నారు

ఆ సిద్ధయ్య నువ్వేనా..? అని అడుగుతున్నారు

- Advertisement -

‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రానికి మంచి విజయం దక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో హీరో కిరణ్‌ అబ్బవరం దాదాపుగా 50 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తెరకు పరిచయం చేశారు. వారిలో విలన్‌ పాత్రలో సిద్ధయ్యగా నటించిన లతీష్‌ మంచి పేరు సంపాదించుకున్నారు. తనకు దక్కిన ఈ మొదటి విజయం గురించి మీడియాతో షేర్‌ చేసుకున్నారు. నగరిలో మాది వ్యవసాయ ఆధారిత నిరుపేద కుటుంబం. నేను సినిమాల్లోకి వచ్చానని మా అన్నయ్య నాతో మాట్లాడటం మానేశాడు. కానీ ఈ సినిమాలోని, నా నటన చూసి మాట్లాడాడు. ఈ ప్రయాణంలో నాకు ఎప్పుడూ అండగా అక్క చాముండేశ్వరి, మావయ్య కోటేశ్వరరావు ఉన్నారు. బెంగళూరులో కొన్ని రోజులు ఉద్యోగం చేశాను. 2017లో హైదరాబాద్‌కి వచ్చి సినిమాల్లో నటించాలని ప్రయత్నించాను. మహిపాల్‌ వద్ద కొన్ని రోజులు అసిస్టెంట్‌గా పని చేశాను. యూట్యూబ్‌లోనే ఓ షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్ట్‌ చేసి, యాక్ట్‌ చేశాను. ఆ తరువాత డా. షేక్‌ జాన్‌ బషీర్‌ వద్ద ట్రైనింగ్‌ తీసుకున్నాను. నా కమిట్మెంట్‌ను చూసి బీ స్టూడియోలో ఫ్రీగా ట్రైనింగ్‌ ఇచ్చారు. అక్కడ నేను నాటకాలు వేస్తున్నప్పుడే ‘తిమ్మరాజు పల్లి టీవీ’ అసోసియేట్‌ డైరెక్టర్స్‌ చూసి ఆడిషన్స్‌ తీసుకున్నారు. ఓ కథకి హీరో ఎంత ముఖ్యమో విలన్‌ కూడా అంతే ఇంపార్టెంట్‌. ఈ మూవీ కోసం ఏకంగా ముప్పై కిలోలు పెరిగాను. సినిమా చూసిన వారంతా సిద్ధయ్యగా చేసింది నువ్వేనా? అని అడుగుతుంటే హ్యాపీగా, సంతృప్తిగా అనిపించింది.
సినిమా చూసి హీరో కిరణ్‌ అబ్బవరం ప్రదీప్‌ని, నన్ను ఎంతో ప్రశంసించారు. అద్భుతంగా చేశావ్‌ అని నరేష్‌ అగస్త్య కూడా పొగిడారు. నలుగురు శిష్యులు ఒకే సినిమాలో నటించడంతో మా బషీర్‌ సార్‌ కూడా సంతోషించారు. ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లిన తరువాత నా గురించి చెప్పి.. నన్ను హగ్‌ చేసుకున్నారు. ఆ మూమెంట్‌ ఎప్పటికీ మర్చిపోలేను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -