- Advertisement -
నవతెలంగాణ – బల్మూరు
మండల పరిధిలోని రామాజీ పల్లి గ్రామంలో ఆదివారం మేక రెండు తలలున్న జీవానికి జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన బక్కమ్మ అనే మేకల కాపరి మేకల మందలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఆయా చుట్టుపక్కల గ్రామస్తులు రెండు తలల మేక పిల్లను చూసేందుకు ఆసక్తిగా అక్కడికి చేరారు. అప్పటికే రెండు తల వింత జీవి మృతి చెందినట్లు మేకల కాపరి వెల్లడించారు.
- Advertisement -



