నవతెలంగాణ-వర్ధన్నపేట
వరంగల్ నగరంలో ఈనెల 6న నిర్వహించబోయే రైతు సంగ్రామ సదస్సుకు పోస్టర్ ను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆవిష్కరించారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. రైతు సమస్యలపై జరుగు సదస్సుకు ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు తూల్ల కుమారస్వామి, పట్టణ అధ్యక్షులు గోధుమల మధుసూదన్, ఏనుమాముల మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ ఏ. జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ అప్పారావు, మాజీ జడ్పీటీసీ మార్గం బిక్షపతి, మాజీ ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్ రావు, మున్సిపల్ కౌన్సిలర్స్ సిలివేరు కుమారస్వామి యాదవ్, గుజ్జ వీర రాఘవ రావు, తిరుపతి సురేష్, చిలువేరు రమ రాజశేఖర్ యాదవ్, బానోత్ జ్యోతి నవీన్,మాజీ కౌన్సిలర్ తుమ్మల రవీందర్, నాయకులు తుమ్మల యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.
రైతు సదస్సు పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



