సరిదిద్దాల్సిన వారే తప్పు చేస్తే…

If they are the ones who should be corrected...‘అలా ఆలోచించడం తప్పు, అన్న భార్య అంటే అమ్మతో సమానం నేను వదినను అలాంటి దృష్టితో చూడను’ అనేవాడు. కానీ ఆమె మాత్రం ప్రదీప్‌ను రెచ్చగొడుతూ ఉండేది. పైగా ‘నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే ఊరికి పంపించేస్తాను’ అని బెదిరించేది.
మంచైనా చెడైనా పిల్లలు పెద్దల నుండే నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్లో పెద్దలు చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. ఎప్పటికప్పుడు పిల్లల్లో మంచి మార్పు వచ్చేలా ప్రయత్నించాలి. పిల్లలు తప్పు దారిలో నడుస్తున్నారేమో చూసుకోవాలి. పొరపాటునా ఏదైనా తప్పు చేస్తే వారికి అర్థమయ్యేలా మంచీ చెడూ చెప్పాలి. ఆ బాధ్యత పెద్దవారిదే. సాధారణంగా ప్రతి ఇంట్లో జరిగేది ఇదే. అంతేకానీ పెద్దవాళ్ళే పిల్లలతో తప్పు చేయించే సందర్భాలు చాలా తక్కువ. కానీ అలాంటి పెద్దలు కూడా ఉంటారని, దాని వల్ల కలిగే పర్యావసానాలు ఎలా ఉంటాయో ఈ వారం ఐద్వా అదాలత్‌ చదివితే మీకే అర్థమవుతుంది.
ప్రదీప్‌ తన పెద్దమ్మ ఇంట్లో ఉంటున్నాడు. ఆ ఇంట్లో తన పెద్దమ్మ, అన్న, వదిన ఉంటారు. వాళ్ళ అన్నయ్య రాము ఎక్కువగా బిజినెస్‌ పని మీద వేరే నగరాలకు వెళుతుంటాడు. ఇక ఆ ఇంట్లో ఉండేది ఇద్దరు ఆడవాళ్ళు. ప్రదీప్‌ వాళ్ళకు సాయంగా ఉండేవాడు. షాపుకు వెళ్ళి సరుకులు తీసుకురావడం, ఏదైనా అవసరం అయితే వదినను, పెద్దమ్మను బండిపై బయటకు తీసుకు వెళ్ళడం చేసేవాడు. వుండేది పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయినా సొంత ఇంట్లో మాదిరిగా ఉండే వాడు.
ప్రదీప్‌ వాషిన్‌మిషన్‌లో బట్టలు వేసేవాడు. వాటిని ఆరబెట్టడంతో పాటు, అప్పుడప్పుడు వంట కూడా చేసే వాడు. అంతా బాగానే ఉంది కదా అనుకుంటున్న సమయంలో ఓ సమస్య వచ్చి పడింది. రాముకు పెండ్లయి ఐదేండ్లు అవుతున్నా పిల్లలు పుట్టలేదు. రాములోనే లోపం వుంది. ఆ విషయం తెలిసి కూడా వాళ్ళ పెద్దమ్మ రాముకు రమ్యను ఇచ్చి పెండ్లి చేసింది. పెండ్లప్పటి నుండి ఆ విషయం రమ్యకు చెప్పకుండా రాము బిజినెస్‌ పనంటూ ఎప్పుడూ బయటకు వెళుతుంటాడు. ఊళ్ళో ఉన్నా ఏదో ఒక పనుందంటూ ఎప్పుడూ బయటే ఉండేవాడు.
పెండ్లయి ఐదేండ్లు అవుతున్న పిల్లలు పుట్టలేదని ప్రదీప్‌ పెద్దమ్మ కొడలినే తిట్టేది. ఈ సారి రాము వచ్చిన తర్వాత ఎలాగొలా నచ్చజెప్పి ఆస్పత్రికి తీసుకువెళ్ళాలని అనుకుంది రమ్య. ప్రదీప్‌కి చెప్పి డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుంది. డాక్టర్‌ ఇద్దరికీ అన్ని రకాల పరీక్షలు చేసిన రాముకు అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు. ఇదే విషయాన్ని ఇంటికి వచ్చిన తర్వాత రమ్య అత్తకు చెప్పింది. దాంతో ఆమె నలుగురికి విషయం తెలిస్తే కొడుకును చిన్న చూపు చూస్తారని బతిమలాడుకుంది. దానికి రాము ‘నాకు ఈ లోపం వుందని తెలిసి కూడా దాచి చెప్పి రమ్య జీవితం నాశనం చేశాను. తనకు విడాకులు ఇచ్చి వేరే అబ్బాయితో పెండ్లి చేస్తాను’ అన్నాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. గుడికి, బాబాల దగ్గరకు రమ్యను తీసుకుని తిరిగేది. కానీ రాము మాత్రం రమ్యతో ‘విడాకులు తీసుకొని ఇంకో పెండ్లి చేసుకో’ అనేవాడు. కానీ రమ్య మాత్రం విడాకులు ఇవ్వడానికి ఇష్టపడలేదు.
‘నాకు పిల్లలు పుట్టకపోయినా పర్లేదు నేను మీతోనే ఉంటాను’ అంది. ఇద్దరూ మంచిగా వున్నారు. కానీ రాము వాళ్ళ అమ్మ మాత్రం ఎలాగైనా కొడుకు, కోడలికి పిల్లలు పుట్టే విధంగా చేస్తే సమాజంలో తన పరువు నిలబడుతుం దనుకుంది. దీని గురించే ఆలోచిస్తున్న ఆమెకు ప్రదీప్‌ కనిపించాడు. ఎలాగైనా ప్రదీప్‌తో కొడలికి పిల్లలు పుట్టేలా చేయాలి అనుకుంది. రాము లేని సమయంలో రమ్యతో మాట్లాడమని, తనకు ఏమైనా కావాలంటే ఇవ్వమని చెప్పేది. కానీ రమ్య మరిదిని కొడుకుతో సమానంగా చూసుకునేది. ప్రదీప్‌కు కూడా వదినపై వేరే అభిప్రాయం ఉండేది కాదు. కానీ పెద్దమ్మ దానికి విరుద్దంగా ‘వదిన చాలా అందంగా వుంది, ఆమెను చూస్తే నీకు ఎలాంటి ఆలోచనలు రావడం లేదా’ అంటూ ప్రదీప్‌తో అంటుండేది.
‘అలా ఆలోచించడం తప్పు, అన్న భార్య అంటే అమ్మతో సమానం నేను వదినను అలాంటి దృష్టితో చూడను’ అనేవాడు. కానీ ఆమె మాత్రం ప్రదీప్‌ను రెచ్చగొడుతూ ఉండేది. పైగా ‘నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే ఊరికి పంపిం చేస్తాను’ అని బెదిరించేది. నగరంలో ఉండటానికి వేరే దారి లేని ప్రదీప్‌ ‘వద్దు పెద్దమ్మ, నేను బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించాలి నేను హైదరాబాద్‌లోనే ఉంటాను. నన్ను ఊరికి పంపించవద్దు’ అంటూ బతిమలాడుకున్నాడు.
‘అయితే నేను చెప్పినట్టే చెయ్యాలి’ అని అతని దగ్గర మాట తీసుకుంది. కోడలికి పాలల్లో మందు మంది కలిపి నిద్రపోయిన తర్వాత ప్రదీప్‌ను ఆమె రూమ్‌లోకి పంపించేది. ఇలా మూడు రోజులు చేసిన తర్వాత అతనికి బాధగా అనిపించింది. తను చేసేది చాలా పెద్ద తప్పు అనిపించి ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చాడు.
‘మా పెద్దమ్మ ఇంట్లో ఇలా జరుగుతుంది. బటయ ఉండి చదువుకునే ఆర్థిక స్థోమత నాకు లేదు. అందుకే అక్కడే ఉండాల్సి వస్తుంది’ అని చెప్పాడు. ‘అక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, మీరే నాకు ఏదైనా దారి చూపించండి. మా వదినకు ఇప్పుడు మూడో నెల. మా పెద్దమ్మ చాలా సంతోషంగా ఉంది. కానీ అన్నా, వదినల మధ్య గొడవలు జరుగుతున్నాయి’. ‘నిన్ను వేరే వ్యక్తిని పెండ్లి చేసుకోమని చెప్పాను. దానికి నువ్వు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఎవరితోనే సంబంధం పెట్టుకున్నావు, నువ్వు నాకు వద్దు’ అంటున్నాడు.
‘అసలు వదినకు తాను ఎలా గర్భవతి అయ్యిందో కూడా తెలియదు. మొత్తం తెలిసిన పెద్దమ్మ మాత్రం నోరు విప్పి మాట్లాడడం లేదు. ఎలా అయితే ఏమిటి కోడలు గర్భవతి అయ్యింది. నలుగురిలో పరువు నిలబడింది అనుకుంటుంది. నన్ను నమ్మిన మా వదినకు నేను చాలా అన్యాయం చేశాను. ఇప్పుడు ఆమె ముందుకు వెళ్ళలేకపోతున్నాను’ అన్నాడు.
అతను చెప్పింది మొత్తం విన్న తర్వాత మేము అందరినీ పిలిచి మాట్లాడాము. ‘నీ ఇష్టంతో సంబంధ లేకుండా నువ్వు తల్లివి అవుతున్నావు. మీ అత్తయ్య వల్లనే ఇలా జరిగింది. మీరు గర్భవతి కావడానికి కారణం ప్రదీప్‌. అతన్ని అలా చేయమని ప్రోత్సహించింది, బెదిరించింది మీ అత్తయ్య. కొడుక్కి ఎలాగో పిల్లలు పుట్లే అవకాశం లేదు కాబట్టి ఆమె ఇంత దారుణంగా ఆలోచించింది. నువ్వు వాళ్లపై కేసు పెట్టవచ్చు. వాళ్ళను జైలుకు పంపవచ్చు. మీకు తెలియకుండా, అభిప్రాయం లేకుండా ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు రాముతో కలిసి వుండాలా లేదా, గుర్భం వుంచుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. మీరు ఏం చేయాలనకుం టున్నారో మీ ఇష్టం. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేము నీకు సపోర్ట్‌ చేస్తాం’ అని చెప్పాం.
‘ఇలాంటి వాళ్ళ మధ్య నేను ఉండను. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. నా భర్త కూడా నన్ను అనుమానించాడు. అందుకే నా కడుపులో ఉన్న బిడ్డను నేనే చూసుకుంటాను. వీళ్ళతో మాత్రం కలిసి బతకను. నా బతుకు నేను చూసుకుంటాను. నాకు ఎలాంటి సాయం కావాలన్నా మీ దగ్గరకు వస్తాను. నాకు అండగా నిలబడినందుకు మీకు ధన్యవాదాలు’ అని చెప్పి రమ్య వెళ్ళిపోయింది.
– వై. వరలక్ష్మి, 9948794051

Spread the love