ఆపదలో ఉన్న పేద ప్రజలకు అండగా ఉంటా..

Will stand by the poor people who are in danger..– యాదయ్య కుటుంబానికి పదివేల ఆర్థిక సాయం అందజేత..

– రియల్ ఎస్టేట్ వ్యాపారవేత , కాంగ్రెస్ మండల నాయకులు ముచ్చపోతుల శ్రీనివాస్ …
నవతెలంగాణ – మునుగోడు
ఆపదలో ఉన్న పేద ప్రజలకు అండగా ఉంటానని మునుగోడు మండల కేంద్రానికి చెందిన రియల్టర్, కాంగ్రెస్ మండల నాయకులు ముచ్చపోతుల శ్రీనివాస్ అన్నారు . నల్గొండ మండలంలోని నర్సింగ్ బట్ల గ్రామానికి చెందిన మహేశ్వరం యాదయ్య (42) గత పది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందగా బుధవారం యాదయ్య భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు  కుటుంబాన్ని పరామర్శించి పదివేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు . ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ  ఆపదలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి విద్యా , వైద్య పరంగా ఎలాంటి సమస్య ఉన్న  అండగా ఉండి ఆదుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో నీరుడు రాజారామ్, రాసమల్ల అశోక్ , బొల్లు సైదులు , సంకు సంపత్ కుమార్ , జంగిలి వెంకటేశ్వర్లు , మహేశ్వరం రమేష్ తదితరులు ఉన్నారు.
Spread the love