తెలంగాణ, ఏపీతో పాటు 16 రాష్ట్రాలు,
మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రక్రియ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మూడో దశ స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(సర్)కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ, ఏపీతో పాటు 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత పాంత్రాల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపింది. ఈ మేరకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఎనిమిది విడతల్లో ఈ మూడో దశ ‘ఎస్ఐఆర్’ను నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీతో పాటు ఒడిశా, మిజోరాం, సిక్కిం, మణిపూర్, దాద్రానగర్ హవేలీ, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్, కర్నాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, మేఘాలయ, ఢిల్లీ, నాగాలాండ్, త్రిపుర ఉన్నాయి. ఇందుకోసం 3.92 లక్షల మందికిపైగా బూత్ స్థాయి అధికారులు (బీఎలఓలు) 36.73 కోట్ల మంది ఓటర్ల వద్దకు వెళ్లనున్నారు.
వీరికి లెక్కింపు దశలో రాజకీయ పార్టీలచే నియమించబడిన మరో 3.42 లక్షల బూత్ లెవల్ ఏజెంట్లు(బీఎలఏలు) సహాయంగా నిలవనున్నారు. అయితే ఈ ప్రక్రియకు సహకరిస్తూ… తమ పార్టీల నుంచి బీఎలఏలను నియమించాలని రాజకీయ పార్టీలను ఈసీ కోరింది. తొలి రెండు దశల్లో 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన సర్ ప్రక్రియలో దాదాపు 59 కోట్ల మంది ఓటర్లను చేరినట్టు వెల్లడించింది. ఈ ప్రక్రియ కోసం 9.2 లక్షలకుపైగా బీఎలఏలు పలు రాజకీయ పార్టీల నుంచి పాలుపంచుకున్నట్టు తెలిపింది. కాగా దేశవ్యాప్త జనగణనలో ఇండ్ల జాబితా ప్రక్రియ, యంత్రాంగాన్ని దఅష్టిలో పెట్టుకొని హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లఢక్‌లకు ఈ మూడో దశ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు పేర్కొంది. ఈ మూడు రాష్ట్రాలు/యూటీల్లో స్థానికంగా ఉండే చల్లని వాతావరణం, ఎత్తైన ప్రాంతాలను దఅష్టిలో పెట్టుకొని సర్ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపింది.
తెలంగాణ, పంజాబ్‌లో ఒకేసారి ‘సర్’ ప్రారంభం
తెలంగాణతో పాటు పంజాబ్‌లో ఒకేసారి ఈ ఎసఐఆర్ ప్రకియ ప్రారంభించనున్నట్టు ఈసీ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో మే12 నాటికి 3,39,20,705 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపింది. వీరిని చేరేందుకు 35,985 మంది బీఎలఓలు, 25,886 మంది బీఎలఏల సహాయం తీసుకోనున్నట్టు పేర్కొంది. కాగా ఈ సిబ్బందికి జూన్ 15 నుంచి 24 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే చేపడతారు. ఆ తరువాత జులై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించి, అదే రోజు నుంచి సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. చివరగా అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ఈసీ ప్రకటించనుంది.
చివరగా సెప్టెంబర్‌లో త్రిపురలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా డిసెంబర్ 12న ప్రకటించబోయే ఆ రాష్ట్ర తుది ఓటర్ల జాబితా ప్రచురణతో మూడో దశ సర్ ప్రక్రియ ముగియనుంది.ఇక ఆంధ్రప్రదేశ్‌తో పాటు హర్యానా, చండీగడ్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఒకేసారి ఎసఐఆర్ ప్రక్రియ జరగనుంది. ఏపీలో మొత్తం 4,16,16,061(ఈ నెల 12 వరకు) మంది ఓటర్లు ఉన్నట్టు వెల్లడించింది. వీరిని చేరేందుకు 46,397 మంది బీఎలఓలు, 68,868 బీఎలఏల సహకారం తీసుకోనుంది. జూన్ 5 నుంచి 14 వరకు సిబ్బందికి శిక్షణ, అదే నెల 15 నుంచి జులై14 వరకు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. అనంతరం జులై 21న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను ఈసీ వెల్లడిస్తుంది.
మూడో దశ ‘సర్’ షెడ్యూల్ విడుదల
- Advertisement -
- Advertisement -



